మా నాన్న గారికి నేను ఎప్పుడో వార్నింగు ఇచ్చాను. నేను చెప్పినదాకా పెళ్లి సంబంధాలు తేవొద్దు అని. సరే అని నాన్న గారు అన్నారు. కానీ అమ్మ పోయింతర్వాత నాయనమ్మ పోరు మొదలవటంతో నన్ను చెన్నై నుంచీ ఒక రోజు అర్జంటు గా రమ్మన్నారు. కారణం లేకుండా రమ్మనారు. అనుకుంటూ ఏమిటి నాన్నగారూ? అని అడిగాను.
మీ నాయనమ్మ పెళ్లి సంబంధం తెచ్చింది. నువ్విక రావాల్సిందే. నన్ను ఈవిడ గారి పోరు నుంచీ రక్షించాల్సింది నువ్వే సృజీ అన్నారు. ఆయన గొంతులోనే నాకు నాయనమ్మ పోరు వినిపించింది. అది వైజాగు సముద్రపు హోరు లాగా ఉంది. ఆయనని ఇబ్బంది పెట్టలేక ఒప్పుకున్నా అక్కడ నాయనమ్మ ఏమి గోల చేసి నా చేత కమిట్ చేయిస్తుందో అని ముందుగానే ఆయనతో... అతను ఎలా ఉన్నా నేను ఒప్పుకోను. అలా అంటేనే నేను వస్తాను. లేదంటే మీరే ఇక్కడికి రండి. ట్రిప్లికేన్ లో వాతావరణం చాలా బాగుంటుంది అన్నాను.
ఆయన నీ ఇష్టాన్ని ఎప్పుడన్నా నేను కాదన్నానా? జస్ట్ అలా ఒచ్చి వెళితే చాలు సృజీ అన్నారు. విషయం తనకి చెప్పాలని ఫోను చేస్తే ఈ నెంబరు కి సర్వీస్ నిలిపివేయబడింది. అని వచ్చింది. ఏమయ్యాడో ఈ మనిషి అనుకుంటూ ఇంటికి ఫోను చేస్తే తనండుకున్నాడు. నేనే బయటకి వచ్చి ఫోను చేస్తాను అన్నాడు.
ఐదు నిమిషాల తర్వాత నా సెల్లు మోగింది. తనే నేమో అని నింపాదిగా తీశాను. ఆత్రం ఎక్కువ ఐతే నింపాది తనం వస్తుందేమో. తను కాదు. పిన్ని. ఒసేయ్ ఎలాగో నీ పెళ్లి చేసేస్తే ఆవిడ ప్రాణం సుఖ పడుతుంది. కాదనకుండా వచ్చేయ్. అంది.
అది కాదు పిన్నీ... అని నేను చెప్ప బోయెటన్తలో బాబాయి అందుకుని తన వాక్ప్రవాహాన్ని మొదలెట్టాడు. ఆది మానవుల కాలం నుంచీ ఆధునిక మిస్సైళ్ళ వరకూ అన్ని ఉపమానాలనీ వినిపించి నాకు పెళ్లి వల్ల కలిగే ఉపయోగాలన్నింటినీ వివరించాడు. ఈలోపు తను నాకు ఐదు సార్లు ఫోను చేసినట్లుగా సెల్లు చెప్పింది.
నేను నా సమాధానాన్ని చెప్ప బోగానే మళ్ళీ అయనే అందుకుని నీకు పెళ్లి అంటే ఎందుకు విరక్తి అని మరో చరిత్ర మొదలెట్టాడు. ఈసారి ఐన్స్టీన్ రిలేటివిటీని ఉపయోగించాడు. అది నాకు అర్ధమవాలంటే తననే అడగాలి. మొత్తం నలభై నిమిషాలు. నేను లెక్చర్ ఇస్తే ఆ సమయంలో నాకు కనీసం పదిహేను వేలు వస్తాయి. ఆయన మాటలు వింటుంటే నాకు నిజంగానే పెళ్ళంటే విరక్తా? అని అనుమానం వచ్చింది.
మరో గంటకి ఫోను మోగింది. ఈ సారి తను. ఉపదేశామృతం జరిగిందా ఏమిటి? అన్నాను. నేను నవ్వాను. తన మాటలు వింటే అంతే. ఎంతటి చిరాకైనా ఎగిరి పోతుంది. విషయం చెప్పాను. సరే. శుభ అదృష్టం అన్నాడు. ఏమి చెయ్యను? అన్నా. నీ ఇష్టం అన్నాడు. అంటే? అన్నా. అంటే నీకు నచ్చితే చేసుకో. నేనంటే ఇష్టమైతే మన ఒప్పందం ముగిసే దాకా ... అన్నాడు. సోగం మాట్లాడి అలా ఒదిలేసి మననే అర్ధం చేసుకో మానటం తన పద్ధతి. సరే. బెస్ట్ ఆఫ్ లక్ టూ యూ అని పెట్టేశాను. నాకోసం వెయిట్ చేశాడేమో అని అనుమానం వచ్చి మళ్ళీ నేనే ఆ నెంబరుకి ఫోను చేశాను. తను వెళ్లి పోతుంటే షాపతను పిలిచాడు. "నేను పది నిమిషాలు చూసి వెళ్లి పోయాను. మళ్ళీ వచ్చాను కానీ నీకోసం వెయిట్ చెయ్యలేదు. అన్నాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. తను మారలేదు. ఎన్ని కష్టాలున్నా తను మారడు. అందుకే నాకు నచ్చేది.
నేను వైజాగ్ వెళ్ళా. పిన్నీ బాబాయీ ఇంకా బంధుగణం వచ్చారు. పెళ్లి చూపులప్పుడు నాకు అంత పౌడర్ రాసి అలంకరించ బోయింది పిన్ని. గట్టిగా వద్దన్నాను. అదేంటే వాళ్ళకి నచ్చొద్దూ అన్నది. ఏమిటి నచ్చాల్సింది.? పౌడేరా? అన్నాను. నోర్మూసుకోవే! నీకు పొగరు ఎక్కువైంది. అంది. నాన్న అక్కడ లేరు. ఇక నేనే బరిలో దిగింది. ఒక్కదాన్నే. నాకున్నది నా నమ్మకమే.
నువ్వు అందంగా ఉంటే నీకు అలంకారాలు అనవసరం అంటాడు తను. నాకూ అలంకారాలంటే చిరాకే. పిన్నీ నేను మామూలుగా వస్తాను. లేదంటే ఇప్పుడే వెళ్తాను. అని ఖరాఖండిగా చెప్పాను. నా చూపులని తట్టుకోలేనట్లు తల తిప్పుకుంది. నాయనమ్మ అది కుందనపు బొమ్మ లాగా ఉంది. దానిని అలాగే వదిలేసినా ఆ మన్మదుడే వచ్చినా చేసుకుంటాడు. అంది. నా బుగ్గలు పిండుతూ. నాన్నకి కళ్ళతోనే చెప్పాను. తేడా వస్తే అంతా డిసాస్టర్ అవుతుందని. ఆయన నవ్వుతూ తలూపారు.
నేను హాల్లోకి వెళ్లాను రమ్మన్నప్పుడు. పెళ్లి కొడుకు చాలా అందం గా ఉన్నాడు. నేను సూటిగా అతని కళ్ళ లోకి చూడగానే తను కళ్లు దించేశాడు. పిన్ని సిగ్గు పాడవే. అంది నావీపు మీద పొడుస్తూ. నేనేమి తప్పుచేశాను సిగ్గు పడటానికి అన్నాను. తల తనవైపు తిప్పి. వాళ్ళడిగిన ప్రశ్నలకిసమాధానం చెప్పాను. సూటిగానే. నిర్ణయాన్ని తర్వాతా చేపుతామన్నారు. నేను నాన్న వైపు తిరిగాను. అయన తలూపారు నాకు అనుకూలంగా. పెళ్లి కొడుకుతో మీరు ఏ డెసిషన్ తీసుకున్నారు? అన్నాను. నా గొంతు నార్మల్ గానే ఉంది.
అతను నా వంక అదో రకంగా చూశాడు. పర్సనల్ గా మాట్లాడాలని పక్కకి తీసుకెళ్ళాడు. అప్పుడు అన్నాడు. మీరు నాకు నచ్చారు. మా అమ్మా నాన్నా ఆలోచిస్తారు. నాకు ఓకే. కానీ ఆలోచించాలి.
నేనోకటే మాటన్నాను. Decissions are to be made quick. ఆలస్యమ్గా చేసేవి నిర్ణయాలు కాదు. మీరు సివిల్స్ చదువుతున్నారుకదా? అక్కడ అప్పటి వరకూ ఊహించని ప్రశ్న వేస్తే ఆలోచించి చెపుతాను అంటారా? అన్నాను. అతను తల దించుకున్నాడు.
కొంత సేపటికి లోపలకి వచ్చాము. రెండు నిమిషాలలో చెప్పారు. మాకీ సంబంధం వద్దు. కట్నం ప్రాబ్లం అని. అదీ ఆ అబ్బాయే. కానీ తన ప్రాబ్లం కట్నం కాదు. నా ఇండివిడ్యువాలిటీ.
Decissions are to be made quick. ఇది తను ఎక్కువగా అంటుంటాడు.నిజమే త్వరగా ఆలోచిస్తేనే నేను నిర్ణయాల్ని బాగా తీసుకునేది. తనూ అంతే. గండం గడిచి నేను చెన్నై చేక్కేశాను.
Oct 10, 2008
నాన్న తెచ్చిన పెళ్లి సంబంధం.
Subscribe to:
Post Comments (Atom)












28 వ్యాఖ్యలు.:
"Decissions are to be made quick" sounds stupid in case of marriage.
మీ individuality ఎ problem అని చెప్పలేని ఓ పిరికి వాడు. ఆబద్ధం ఎందుకు ఆడాలి - కట్నం ప్రాబ్లెం అని. వాడికి పెళ్లి ఎందుకు. వెధవ ఏమి ఉద్యోగం వెలగ పెడుతున్నాడు??
నాయనమ్మ తెచ్చిన పెళ్లి సంబంధం అనుకుంటా?. నేను కూడా వర ప్రసాద్ గారి కామెంటు తో ఏకీభవిస్తాను.
ఇంకొక్క విషయం.. చెన్నై లో వాతావరణం బాగుంటుందా? అక్టోబర్ లో కూడా చుక్కలు కనపడుతుంటేనూ.
"ఏ డెసిషన్ తీసుకున్నారు?" అన్నప్పుడు సృజీ గొంతు నార్మల్ గానే వుందా? ఐనా అతడు ఆమె వంక అదో రకంగా చూశాడా? ఆలస్యంగా చేసేవి నిర్ణయాలు కావా!!!
"నాకు ఓకే. కానీ ఆలోచించాలి." :)
whether it's a real event or imagined, very fresh narration. good show.
@వరప్రసాద్ గారు,
ఇరవై నాలుగేళ్ల జీవితం లో ఎప్పుడూ నిర్ణయాలకి రెండు నిమిషాలకన్నా ఎక్కువ ఆలోచించలేదు. అంతకు మించి ఆలోచించినవి దెబ్బతిన్న అనుభవమే ఎక్కువ. అవీ కొద్ది సంఖ్యలోనే. ఈ విషయం ఎక్కువగా అనే తనకి కూడా ఇది అనుభవమే.
@కొత్తపాళీ గారు,
ఇది జరిగింది గత February లోనే. మీ మెచ్చుకోలుకి నెనెర్లు. ఇందులో తన చెయ్యి కూడా సోగం ఉంది. ఎందుకంటే నేరేషన్ స్టైల్ ని నాకు సజస్ట్ చేసింది తనే. :-)
Very good post. I will write about it for sure. A new and good post.
visit...
priyamainamaatalu.blogspot.com
మీరు తీసుకున్న నిర్ణయాలు జీవితం లో ఎప్పుడు ఉన్నతంగా ఉంచాలని, భాదించకూడదని ఆశిద్దాం.
"ఆత్రం ఎక్కువ ఐతే నింపాదితనం వస్తుందేమో.": చాలా నవ్వొచ్చింది ఎందుకో....
నా పోచికోలు సలహా ఏంటంటే, పాపం అతన్ని గాభరా పెట్టకుండా, ఒప్పందం ముగిసేదాకా ఆగండి :-)
good narration.
however unable to digest the content being a parent.
may be generation gap rifts us apart.
good luck
bollojubaba
"Decissions are to be made quick"
ఒప్పుకోలేను అలా అని కాదనలేను..
- కిరణ్
ఐతే OK
@ఫణీంద్ర గారు:
తనని గాభరా పెట్టటమంటే... బుష్ చేత యుద్ధం మాన్పించటమే. ఎంత మాత్రం కంగారు లేకుండా అదోలా నవ్వుతూ చూపులతో వేయి సమాధానాల్ని చెప్తాడు.
అఫ్కోర్స్, నాకూ కంగారు లేదనుకోండీ.
వ్యాఖ్యకి ధన్యవాదాలు.
హమ్మయ్య.. మొత్తానికి గండం గడిచిందన్న మాట :)
మొత్తానికి అలాంటి పెళ్లికొడుకొచ్చాడు కాబట్టి సరిపోయింది.
ఒకోసారి చెడగొట్టటం కూడా కష్టమే :)
సృజన గారు నాకు కొంత అర్దం అయి కొంతకాలేదు ఎందుకంటే ఏదో ఒప్పందం అంటున్నారు అది చదివితే గాని మిగిలినది అర్దం కాదేమో :) ఎవరతను ? తెలుసుకోవచ్చా.. మిగిలిన పోస్ట్ లింకులు ఇవ్వగలరా :)
ట్రిప్లికేన్ వాతావరణం ?#@#$!! :-) సెటైరా? ఐతే ఓకే... అన్నట్లు నేను జాజిపూలు నుండి ఇటువచ్చాను.. ఇది గడిచి చాలా రోజులైనట్లుంది.. ప్రస్తుతానికి ఒప్పందం ముగిసి తొలి మజిలీ చేరుకున్నారా మరి...
"ఆలశ్యంగా చేసేవి నిర్ణయాలు కాదు." మీతో ఏకీభవించ లేనండీ. ఆలోచించకుండా చేసేవి అస్సలు కాదు... Instant decisions will be driven by instinct... and serious decisions about life like marriage should be driven by intellect. కానీ మీరు చెప్పిన కధని బట్టి చూస్తే మీరు కూడా ఏదో ఆలోచించే ఓ ఒప్పందం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు అని అనిపిస్తుంది. కనుక మీ ఉద్దేశ్యం ఆలోచనకి తీసుకుంటున్న వ్యవధి గురించి మాత్రమే కానీ అసలు ఆలోచించవద్దు అని కాదు అనుకుంటున్నాను.
decisions are to be made quick - hmmm.. i guess not many people would agree to that, but AFAIK i prefer and take decisions uber quick. sometimes (read very rarely) they seem not upto the mark in hindsight, but the rest of times, it worked/works for me.
స్రుజనా ,
డెసిషన్ ఎప్పుడు తీసుకున్నా ,మీ నయనమ్మగారి కి పరిస్తితి చెపితె సరి పొతుందిగా మళ్ళీ పెళ్ళిచుపుల బాధ వుండకుండా.
రాసిన పద్దతి బాగుంది
Very great decision Madam. I know it. He certainly deserves it. But why suddenly today this much of comments?
@Venusrikanth,
Decisions are made quick means... ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం అని కాదు. వేగం గా తీసుకునేదని. మాస్టర్జీ వాడే సందర్భం వేరు.
"మీ ఉద్దేశ్యం ఆలోచనకి తీసుకుంటున్న వ్యవధి గురించి మాత్రమే కానీ అసలు ఆలోచించవద్దు అని కాదు అనుకుంటున్నాను."
Yeah right. That's what he says.
నేపధ్యం తెలీకుండా - ఈ ఒక్క టపా చదివి - కామెంటుతున్నాను. కాబట్టి నా వ్యాఖ్య పూర్తిగా సరి కాకపోవచ్చు.
>> "Decissions are to be made quick. ఇది తను ఎక్కువగా అంటుంటాడు".
నిర్ణయాలేవైనా రెండు నిమిషాల్లో తీసుకోవాలనేది మీ సొంత అభిప్రాయంలా లేదు. 'తన' అభిప్రాయంలా ఉంది. అతని ప్రభావంతో అభిప్రాయాలేర్పరచుకునే మీరు ఇండివిడువాలిటీ గురించి మాట్లాడటం వింతగా ఉంది. ఎలాగైనా పెళ్లిచూపులు తిరగ్గొట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఆ పెళ్లికొడుకు ఏం చేసినా మీకు అభ్యంతరకరంగానే ఉంటుంది. మీ వైపునుండి ఆసక్తి లేదు కాబట్టి అతనికంత ప్రాముఖ్యత ఇవ్వటం, వాల్యూ జడ్జ్‌మెంట్ చేయటం ఎందుకు? అసలు కధ మీ ఇంట్లోవారికి చెప్పి ఒప్పించాలి కానీ ఈ దాగుడుమూతలెందుకు?
అయ్యా అబ్రకదబ్ర గారు,
మీరు చెప్పింది నిజమే. మీకు నిజంగానే నేపథ్యం తెలియలేదు. అందుకే
"అతని ప్రభావంతో అభిప్రాయాలేర్పరచుకునే మీరు ఇండివిడువాలిటీ గురించి మాట్లాడటం వింతగా ఉంది." అన్నారు. ఇక్కడ నా individuality కి వచ్చిన లోపమేమీ లేదు. నావి అన్నీ స్వయన్నిర్ణయాలే. ఎవరి ప్రభావమూ నా మీద లేదు. నేను నా చేతల్లో చేసే పనినే తను మాటల్లో అంటుంటాడు. మరి చేతల సంగతో... అంటారా? చేతల్లో మాటల్లో అనే వాటిని చేతల్లో చోపుతాడు కనుకే తానంటే మా నాన్నగారికి అంత గౌరవం. విషయం ఆయనకీ తెలుసు కనుకే నా వెనుక ఉన్నారు.
ఆ పెళ్లి కొడుకు లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. If a woman has 'self' a man never tries to approach her. ఆ ఒక్క విషయం వల్లే ఎన్నో జంటల మధ్య అగాధాలు పుట్టాయి. అతనిని తిరగ్గొట్టే ఉదేశ్యం ఉండబట్టే నను అలా చేయలేదు. అక్కడ చెప్పాకూదదనుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. నాకు అలా నాంచే వారంటే అంత నచ్చదు.
ఇక అది "Decisions are to made quick." కాదు. "Decisions are made quick. The more important the decision, the quicker." అని ఉండాలి. దాన్ని మేము practical గా observe చేసే ఉన్నాము.
BTW "నేపధ్యం తెలీకుండా - ఈ ఒక్క టపా చదివి - కామెంటుతున్నాను. కాబట్టి నా వ్యాఖ్య పూర్తిగా సరి కాకపోవచ్చు." అన్నారు. Nice gesture. I appreciate it.
ఇంతకీ మీ "ఆ ఒప్పందం" చేసుకున్న వ్యక్తినే మీరు పెళ్ళి చేసుకున్నారా? లేక ఇంకా ఒప్పందంలోనే ఉన్నారా? లేక మధ్యలో మరికొన్ని గన్నాయిగాళ్ళు తగిలారా? తగిలితే ఎలా డిసైడ్ చేస్తున్నారు? కొంచెం చెప్పరూ! తొందరగా నిర్ణయించేసుకునేవారికి ఒప్పందం అంటూ కాలయాపన కూడా ఎందుకో?(వ్యక్తిగత కారాణాలు చాలా ఉండొచ్చు లెండి..అది తప్పు అని నా ఉద్దేశ్యం కాదు)
ఉన్న మాటర్ లో నాకు రెండు విషయాలు తోస్తున్నాయి :
ఒకటి:
"మీరు నాకు నచ్చారు. మా అమ్మా నాన్నా ఆలోచిస్తారు. నాకు ఓకే. కానీ ఆలోచించాలి."
- నా కతను చాలా కరెక్ట్ గా ఉన్నాడనిపిస్తోంది; అతను నిర్ణయించేసుకున్నాడు - పెళ్ళి చేసుకోవడానికి; అతన నిర్ణయించేసుకున్నాడు -నిర్ణయాన్ని కుటుంబం సమిష్టిగా బయట పెట్టాలని. సివిల్స్ చదివినవాడు (చదవటమేమిటో! :)) అతనికి తెలుసు - నిర్ణయం తనదైన,అది సమిష్టిదిలాగా ఆలోచింపబడి,సమిష్టి నిర్ణయంగా భావించబడాలి అని.
"రెండు నిమిషాలలో చెప్పారు. మాకీ సంబంధం వద్దు." - చాలా ఫాస్ట్ గా డెసిషన్ చెప్పారు!
"కట్నం ప్రాబ్లం అని. అదీ ఆ అబ్బాయే." - అందుకే అబ్బాయే నిజంగా చాలా ఫాస్ట్ డెసిషన్ మేకర్ అనిపిస్తోంది.
"కానీ తన ప్రాబ్లం కట్నం కాదు. నా ఇండివిడ్యువాలిటీ." - ఇక్కడ మళ్ళా ఓ డిఫెరెంట్ యాంగిల్ ఉంది. అమ్మాయి నచ్చలేదు అని గానీ, చాలా ఇండువిడ్యుయల్ ( సజెస్టెంగ్ "పొగరు" )అనిగానీ, "మగాడు" చెప్పేమాట కాదు.వ్యక్తిగతంగా మీరు అలాంటి నిజాయితీ నిండిన సమాధానాలకి జంకరేమో గానీ, చాలా చోట్ల అలాంటి జవాబులకు చాలా రకాల సామాజిక రామిఫికేషన్స్ ఉంటాయి.
పెళ్ళి జరగాలి అని కోరుకున్ననాడు,"కట్నం" అసలు ప్రాబ్లెం కాదు అనేది అందరికీ తెలిసిందే అని అనుకుంటాను.అలాగే బాగా "ఆలోచించి" - "జాతకాలు" కలవట్లేదు అని తరువాత కబురు పంపించటం కూడా, జస్ట్ ఓ లౌకికమైన మర్యాద పూర్వకమైన "నో" అనే సమాధానం. ఫర్ ఆల్ యూ నో, ది మదర్ ఇన్ లా జస్ట్ డింట్ లైక్ ది హోల్ ఫ్యామిలీ అండ్ ది బ్రైడ్ గ్రూమ్ ఫైళ్డ్ టు బ్రింగ్ ఎ కన్సెన్సెస్ ఇన్ హిస్ ఫ్యామిలీ.
అలాగే అతనికి నచ్చింది కూడా నిజానికి మీ ఇండువిడ్యుయాలిటీ అయి ఉండొచ్చు; నచ్చని గుణం ఆ ఇండివిడ్యుయాలిటీలో - "సమిష్టి నిర్ణయానికి స్థానం ఇవ్వలేని"తనం కావచ్చు!
(అతడేమి ఉద్యోగం చేసున్నాడు? బ్లాగులు రాస్తాడా? - ఐ వాంట్ టు సీ ఇఫ్ హీ కుడ్ మేక్ దిస్ సో ఫాస్ట్! ;) )
రెండు:
నా ఉద్దేశ్యం మీరు నిజానికి ఓ నిర్ణయం "చూడకుండానే" తీసుకున్నారు;చూసిన తరువాత మీరు మీ "నిర్ణయాన్ని" మార్చుకోలేదు. ఏ గన్నాయి గాడు వచ్చినా, మీరు "నో" అనే వారు కాబట్టి, వచ్చిన వాడికిసుమంత తెలివున్న, అత్మాభిమానమున్నా తరువాత మీ నించి "నో" అనే సమాధానం వచ్చేలాగా సిట్యుయేషన్ ని హ్యాండిల్ చేయడు.వాడే "నో" అని చెప్పి వెళ్తాడు.
ఆఫ్ కోర్స్ , ఇఫ్ హి ఈజ్ ఇన్ లవ్, ది స్టోరీ కెన్ గో ఫ్రమ్ దేర్ ఇంటూ ఏ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.
రేరాజ్ రివ్యూస్; ఇది మీ వ్యక్తిగతమైన విషయం కనక, మీరు వ్యక్తిగతంగానే చూసే ప్రమాదం ఉంది; దయ్చేసి అలా చూడకుండి; నేను కధలగానే విశ్లేషించానని మనవి.చాలా రోజుల క్రితం జరిగిపోయిన విషయం కనుక, ఆబ్జెక్టివ్ గా చూడగలరని ఆశిస్తున్నాను.
I hope he did understand my suggestion. But as of what I learned from him after a chance meeting, "ఒకమ్మాయి అంత నిర్భయంగా గా సూటిగా మాటలాడటం నేను తట్టుకోలేక పోయాను."
They did make that decision quick, and there were some other issues which are not to be revealed.
సమిష్టి నిర్ణయానికి స్థానం ఇవ్వరాదని నేను ఎక్కడ అనలేదు. :-) But one thing is for sure. He might have understood my feelings, and acted accordingly. I donno.
మా లక్ష్యాలని చేరుకునే ప్రయత్నం లో మేము సమిష్టి గా చేసుకున్న ఒప్పందం అది. మా లక్ష్య సాధన పూర్తవగానే ఒక్కటవుతాం.
ఇక గన్నాయి గాళ్లంటారా... ఆ తరువాత మా నాన్నగారు మా నాయనమ్మని కన్విన్స్ చేయటం తో మమ్మల్ని ఆవిడ అర్థం చేసుకుని ఆశీర్వదించటముతో అ సమస్య రాలేదు.
:)ఆల్ ది బిస్ట్. డోంట్ ఫర్‍గెట్, ఇన్వైట్ ఆల్ ఆఫ్ అజ్! :)
Sure. Sure. :-)
i agree with rayraj...........already meeru verevallani like chestunnaru kabatii.vere vallalni understand chesukoleru.......free mind to vunntlaite bane vuntundi............naaku nachhaledu offcourse naku nachhalani ledu........
I have taken immediate decision to appreciate your story
Post a Comment
You're Welcome.