Mar 20, 2009

సంబరం... Celebration of life



నేను జీవితం గడపటాన్ని ఇష్టపడను...
జీవించటమే నా ధ్యేయం.

నేను ముందు నడుస్తుంటే...
నాకేమి ఇస్తుందా అని...
కుతూహలంతో నన్నది అనుసరించాలి.

అమెజాన్ ఎదురుగ ఉన్న నాకు
లక్ష్యం ఆవలి ఒడ్డునుంటే...
ఈత రాని నేను ఎలా చేరేది?

నేనంటే నాకు చాలా ఇష్టం...
లక్ష్యం లేని జీవనం ఎంతో కష్టం.

అందుకే దూకాను ఈతరాని నేను
ఆ పెద్ద నదిలో...
సాధించాలనే ఆశల సడిలో.

చిత్రం చేరాను నా కల(ళ)ల తీరాన్ని
చదివేశానిక జీవితాన్ని.

అప్పుడర్ధమైంది నాకు
జీవితమంటే ఎదో కాదని...
అది ఒక కలల పందేరమని,
అంబరాన్నంటే సంబరమని.

నోట్: ఇది నేను రాసిన కవిత కాదు. తను రాసిన ఒక పాటకి (Lyrical prose) నేను సాహసించిన అనువాదం.

తను రాసిన మొదటి మూడు లైన్లూ ఇక్కడ.

I don' wanna live my life...
I wanna lead it...
so that It must wonder
What I'm gonna give it.

అనువాదంలో ఆ భావం చెడినా నేను ఏమీ చేయలేను. ఎందుకంటే నాకు రాయటమే అంత రాదు. మరి కవిత్వం ఏమి వస్తుంది? ;-)

Bussiness reports మాత్రం బాగా రాస్తాను. అది నా వృత్తి కదా. :-)


11 వ్యాఖ్యలు.:

sujji said...

srujana, good start. keep writing. mee chanti raasina original version inka baagundi untundi. anyways, congrats to u both.

YEAH IT'S ME: Chanti said...

Then I came to know,
What the life is...
Life's a celebration...
Or Celebration of life,
IN THE NAME OF THE BEST WITHIN US.

Dhanaraj Manmadha said...

Oh! What a wonderful expression. Very nice Madam.

"Life's a celebration...
Or Celebration of life,
IN THE NAME OF THE BEST WITHIN US."

Brilliant.

"జీవితమంటే ఎదో కాదని...
అది ఒక కలల పందేరమని,
అంబరాన్నంటే సంబరమని."

Equally brilliant.

కత్తి మహేష్ కుమార్ said...

బాగుంది కానీ, అక్కడక్కడా ఏదో "తెగిన" భావన. ప్రవాహమో, భావమో,అనువాదమో ఏదో తెలీదు.ఆంగ్ల మూలం పూర్తిగా ఉంటే కొంత ప్రయత్నించొచ్చు.

Srujana Ramanujan said...

మొత్తం 107 లైన్ లు ఉన్న ఇంగ్లీష్ వెర్షన్ అది. దానిలో కొన్నింటిని మినహాయించి ఇక్కడ అనువాదం పట్టాను. మిగతావి అందుకునే భావ సౌలభ్యత నాకు అందలేదు. త్వరలోనే ఇంగ్లీష్ వెర్షన్ పెట్టే ప్రయత్నం చేస్తాము. అందుకే ఆ తెగిన భావన కలిగి ఉండవచ్చు.

కత్తి మహేష్ కుమార్ said...

don' wanna live my life...
I wanna lead it...
so that It must wonder
What I'm gonna give it.
Then I came to know,
What the life is...
Life's a celebration...
Or Celebration of life,
IN THE NAME OF THE BEST WITHIN US.

నా ప్రయత్నం....

జీవితాన్ని జీవించడం కాదు
సాధించడం నా ధ్యేయం
జీవితం నాకేమిస్తుందని కాదు
నేను తనకేమిస్తానో అని జీవితాన్ని
ఎదురుచూసేలా చెయ్యటం నా లక్ష్యం

ఆ తరువాత తెలిసింది
జీవితం సాధన కాదు
శోధన అంతకన్నా కాదు
జీవితమొక ఉత్సవం
జీవనమూల్యాన్ని
తెలుసుకునే సంబరం

గీతాచార్య said...

కత్తి గారూ సూపర్. కేక. భలే బాగా ఆ ఎగ్రెషన్ ని క్యాచ్ చేశారు. మొదటి స్టాన్జా అదరగొట్టారు. BTW చాలా కాలం అయింది ఇది వచ్చి. ఇవాళ చూశారా? ఎలా?

చివరి రెండు లైన్లూ తీసివేసి ’అంబరాన్నంటే సంబరం’ అంటేనే బాగున్నట్టుంది. క్లాప్స్. (క్లాప్స్ స్మైలీ దొరకలేదు)

బొల్లోజు బాబా said...

మహేష్ గారి అనువాదం భలే వచ్చింది.

గీతాచార్య said...

బాబా గారు,

బాగా సెప్పిన్రు.

But what about the original?

బొల్లోజు బాబా said...

గీతాచార్యగారు
వరిజనల్ అంటే శ్రుజన గారు చేసిందనా? దట్స్ ఫైన్.

ఏ అనువాదానికైనా మొట్టమొదట చేసిన వారికే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలని నా అభిప్రాయం.ఎందుకంటే గడ్డివాములోంచి సూదిని తవ్వితీసింది వారే కదా! తరువాత తరువాత ఎంతమందైనా ఎన్నిమెరుగులైనా దిద్దవచ్చు. :-)

బొల్లోజు బాబా

గీతాచార్య said...

బాబా గారు,

మీరు కాస్త అపార్థం చేసుకున్నట్టున్నారు. original అంటే నేను వ్రాసిన ఆంగ్ల మూలం. సృజన చేసిన దాని గురించి మీరు చెప్పింది నిజమే. :-)

Post a Comment

You're Welcome.