img.emoticon { padding: 0; margin: 0; border: 0; } సృజనగీతం: గోధూళి లేఖ img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Dec 4, 2009

గోధూళి లేఖ

కొన్ని సార్లు ఎక్కడైనా కామెంటేప్పుడు చంటి అర్ధోక్తిలో ఆపేస్తాడు. అందులోనూ ఒకరకమైన అందం ఉంటుంది. అలాంటిదే ఈ చిన్ని కవిత. గొప్ప అనటం లేదు కానీ, ఒకటి రెండు చమకులున్నాయి.


ఎక్కడెక్కడో ఎందుకు? ఒక చోటే ఉంటే ఎప్పుడైనా ఆలోచన వస్తే సంపూర్తి గా మార్చవచ్చు కదా అని ఇలా...

చంద్రోదయానికై ప్రకృతి కాంత
వేచి చూస్తూ గోధూళితో
ఆకసానికి లేఖ రాసి పంపింది
రాకేశుని జాడ తెలిస్తే కబురంపవమ్మా
చుక్కల చీరె కట్టుకొనే నెచ్చెలీ
ఓపలేకున్నది నీ ప్రియ సఖియని

గోధూళి తో లేఖ ఎందుకో తమాషాగా అనిపించింది. ఆకాశానికి పెట్టిన పేరు ముచ్చటగా లేదూ...