కీకీ (కీర్తి) ఎవర్ని చూశన్నా ఉబుదుం దుబుగుం అందంటే... "I like you, నీకు కావాలంటే నన్ను కాసేపు ఎత్తుకుని తరించు అని."
సరిగ్గా మాటలు రావు కానీ, భలే హుషారైంది. మాటలు రావన్నానని అసలు కమ్యూనిక్షన్ రాదని కాదు. తనదైన శైలిలో కొత్త కొత్త సౌండ్లతో ఏవేవో కబుర్లు చెపుతుంది. కొన్ని కొన్ని మాటలు కూడా చెప్తుంది.
నీ పేరేంటీ అంటే "గిగి" అంటుంది. అదే... కీకీ కి కొంచం తమిళ్ యాసలో. :-)
ఈ వారం రోజుల్నుంచీ నాకు బాగా అలవాటయ్యింది. కాసేపొచ్చి మంచం మీద కూచోటం. నేను నెట్‍బుక్ లో సర్ఫ్ చేస్తుంటే పక్కన కూచుని అవీ ఇవీ నొక్కటం, అగ్గా అనటం (అక్కా), పట్టించుకోక పోతే జుట్టు పీకటం ఇవీ మా దిన చర్యలు. ఎక్కువ అల్లరి చెయ్యకుండా బుద్ధిగా ఉన్నా, మాంఛి హుషారైంది. నా తర్వాత మా ఇంట్లో చిన్న పిల్లలు తిరగటం ఇదే. నాకైతే ఈ కొత్త అనుభవం భలే అనిపిస్తోంది.
వాళ్ళ అమ్మకి చక్కగా సహాయం చేస్తుంది. అదే నాకు మాత్రలిస్తుంటే అందుకుని నోట్లో వేస్తా అనటం, నేను కొంచం నీళ్ళు తాగి పక్కన పెడితే చక్కగా పారబొయ్యటం (మంచం మీద), అదేమంటే వెవ్వెవ్వె అని ఎక్కిరించే ప్రయత్నం చెయ్యటం.
రోజుకి నాలుగో ఐదో కొత్త మాటలు తన వొకాబ్యులరీలో చేర్చుకుంటం. ఎవరికన్నా హాయ్ చెప్పాలన్నా బాయ్ చెప్పాలన్నా బింగుం అంటుంది. చంటీ వాళ్ళు అనే మాట అది. కొత్తగా ఎవరన్నా పరిచయమైతే ముందు నమస్తే పెట్టి చుకుముకుచుం (ఆ భాష నాకు రాదు. తన భాషలో ఏమైనా మర్యాదా పూర్వకమైన పలకరింపేమో. ఇక్కడికి వచ్చాకే నేర్చుకుందట. ;-))అంటుంది.
నేనైతే ఎప్పుడూ ఏడవటం చూడలేదెక్కువ. నాకు హాస్పటల్లో ఇంజెక్షన్ చేసినప్పుడు మాత్రం కాసేపు ఏడిచింది. డాక్టర్ తో పోట్లాడిందట. కేరింత కొడుతూ డాన్స్ వేస్తుంది. బుడి బుడి అడుగులతో పరుగులు తీస్తూ ఆ వస్తువులూ, ఈ వస్తువులూ కదిలిస్తుంది. కాకపోతే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టేస్తుంది.
ఇక చంటి కనిపిస్తే మాత్రం ఇద్దరూ ఆ పిల్లల భాషలో ఒకటే గుసగుసలు. ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండరు. వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. వద్దు అంటే ఆగిపోతుంది. ఏదన్నా చిన్న పని చెపితే చేస్తుంది.
తన భాష మనకి ఏదో రకంగా అర్ధమయ్యేలా హావభావాలు చూపిస్తూ కొంటెగా నవ్వుతుంటే ... ఊహించుకోండి చంటి పిల్లల ముద్దు ముచ్చట్లు. ఆ పసి నవ్వులు భలే ఉంటాయి కదూ. అన్నట్టు నీకెన్ని పళ్ళు అంటే ఎంజి అంటుంది. ఆరో ఏడో పల్ళున్నాయి. ఉన్నాయి కదా అని కొరకదనుకోండీ.
తన వొకాబ్యులరీ:
అమ్మ == అమ్మ
అగ్గ == అక్క
జుంజుంజుం == చంటినదగాలంటే అలానే అంటుంది. బైకెక్కి తిరుగుతారు కదూ ;-)
అప్పూ == నాన్న
బింగుం == హాయ్/బాయ్
గాగా == టాటా
చుంచుం == నీళ్ళు
అగ్గచ్చి == టాబ్లెట్
బుజ్జుం == అన్నం
పీపీ == కాఫీ
చా == టీ
దింకుం == డ్రింకు
తెన్ == పెన్
అన్యా == అన్నయ్య (పార్థ సారథి స్వామిని చూసి అలా అంటుంది. అది చంటి దగ్గర పట్టుకుంది. అన్యా చుకుముకుచుం అంటుంది దేవుడి గదికి వచ్చి. అంటే అన్నయ్యకి దణ్ణం పెడతా అని. నిన్నా, మొన్నా నాన్న ధనుర్మాసం పూజ చేస్తుంటే బుద్ధిగా పక్కన కూచుని ఆయన పాశురాలు చదువుతుంటే ఏవేవో రాగాలు తీస్తూ పూలు చల్లుతోంది.
నచ్చిన వాళ్ళకి చక్కగా ముద్దు పెట్టి డీ కొడుతుంది. ఇవండీ సంగతులు. శైలజ గారూ, కీకీ ఎల్లుండి వెళ్ళిపోతున్నారు. నాకా పిల్ల బాగా మచ్చికైంది. మళ్ళా ఎన్నాళ్ళకో కదా... అందుకే ఇక్కడ నా ఙ్ఞాపకాల్ని పెట్టుకుంటున్నాను. ఎంతైనా పిల్లౌ పిల్లలే కదా... :-)
నాకు టపా టైపు చేసి పెట్టిన వదినకి ఒక చ్చుచ్చు (కీకీ భాషలో ఒక థాంక్స్ ముద్దు)
ఇంత సేపూ నా సుత్తి భరించినందుకు ధన్యవాదాలు
మబ్బు కన్నెలతో ఉషోదయం...
-
పొద్దున్నే మాణింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు కనబడ్డ మనోహర దృశ్యం. ఇంటి దగ్గర
అంత ప్రకృతి సౌందర్యాలేవీ లేకున్నా అప్పుడప్పుడూ ఆకాశంలో ఇలాంటి దృశ్యాలు
కనువిందు ...
1 year ago


