నేను పుట్టి పెరిగిన పరిస్థితులను బట్టీ నాకు పల్లెటూళ్ళతో అనుబంధం తక్కువే. అలా అని పెల్లెటూళ్ళంటే నాకు వ్యతిరేక భావమేమీ లేదు. ఆమధ్య నాయనమ్మతో వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చాను కూడా. (ధవళేశ్వరం దగ్గరలో). ఆ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఎప్పుడో అరుదుగా దొరికే అలాంటి అవకాశాలు తప్ప నాది నగర జీవనమే. నా చాలా అలవాట్లు కూడా అలాంటివే మరి. :-)
నేను పుట్టి పెరిగింది వైజాగైతే (చంటి మీదంతా వైజాగింగ్ అని ఎక్కిరిస్తుంటాడు) చదువులో కొంత భాగం హైదరాబాదులోనూ, ఢిల్లీలోనూ నడిచింది. నా పీజీ మొత్తం ఢిల్లీలోనే. తర్వాత ఉద్యోగ జీవితం చెన్నైలో మొదలయి, అలా అలా దేశాలు పట్టి తిరుగుతున్నాను. ఐపీఎల్లో నా సపోర్టెక్కువ ఢిల్లీ డేర్‍డెవిల్స్ కే. కారణం పెద్దగా ఏమీ లేదు. సెహ్వాగ్ ఉన్నాడనే. ;-) ఆ పైన ఎక్కువ చెన్నై. ఈ విషయమ్మీదే మొన్నా మధ్య నా పీఎస్ శ్రియా మోహన్ కీ నాకూ ఒక చిన్న సంభాషణ జరిగింది. లీషర్ టైమ్ కావటంతో నాకు నచ్చిన సిటీస్ గురించి అడిగింది. అప్పుడు తనతో పంచుకున్న విషయాలే ఇక్కడా పంచుకోవాలని...
నేను పుట్టింది వైజాగైనా నాకు బాగా నచ్చిన ఊరు చెన్నై.
అక్కడ ట్రిప్లికేన్లో పార్థసారథి స్వామి కోయిల్ దగ్గరే ఉంటాను. చాలా లీషర్లీ వాతావరణం. ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంటుంది. పొదున్నే స్నానం పూజ కాగానే గుళ్ళోకి వెళ్ళిన తర్వాతే నా రోజు మొదలెడుతాను. ఈ గుడి గురించి చాలా కబుర్లే చెప్పాలి. మరెప్పుడైనా.
చెన్నై వాతావరణం ఉక్కపోతగా ఉన్నా, కొన్ని సార్లు భరించలేని వేడి ఉన్నా ఎందుకో ఒకరకమైన ఫెమిలియారిటీ ఉంటుంది. మన అనిపిస్తుంది. దగ్గరలోనే బీచ్, ప్రెసిడెన్సీ కాలేజ్, వివేకానందర్ ఇల్లమ్, కొంచం పక్కకెళితే మౌంట్ రోడ్. నాకు మౌంట్ రోడ్డన్నా, అక్కడి వాతావరణమన్నా బాగా ఇష్టం. చెన్నైలో ఉన్నప్పుడు సాయంత్రాలు అలా వెళ్ళి ఏ బుక్ పాయింట్లోనో, స్పెన్సెర్స్ లోనో, హిగ్గింబాథమ్స్ లోనో, తిరిగి రావటం భలే అనిపిస్తుంది.
నా చుట్టు పక్కల వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ. గుడిలోని అర్చకులూ, ఎక్కడి నుంచో వచ్చే పూల బామ్మా (నాకు ధనుర్మాసంలో పొద్దున్నే వచ్చి పూలిచ్చే ఈ బామ్మంటే నాకు చాలా ఇష్టం. నేను ఒక వేళ ఆ సమయంలో అక్కడ లేకపోతే నా బదులు కోయిల్లో పూలిచ్చి అర్చకులకి చెప్పి మరీ వెళుతుంది. సెల్వితో అప్పుడప్పుడూ కల్సి వెళ్ళే టీ కార్నర్, భలే తమాషాగా ఉంటుంది. ట్రిప్లికేన్ మెయిన్ రోడ్డులో ఉంటుంది. అక్కడి మసాలా టీ నాకు భలే ఇష్టం.
ఇక చెన్నై కాదు కాదు తమిళ్ సాంబార్ వడా... చెప్పేదేముంది? ;-)
ఇక నా కాలేజ్ చదువు సాగిన ఢిల్లీ అన్నా నాకు ఇష్టమే.
ఇండియన్ సిటీస్ లో చెన్నై కాకుండా నాకు బాగా నచ్చినది ఢిల్లీనే. కొన్నాళ్ళు గుర్గాఁవ్ లోనూ, మరి కొన్నాళ్ళు లక్ష్మీ నగర్ ప్రాంతం లోనూ ఉన్నా.
ఇండియన్ సిటీస్ లో చెన్నై కాకుండా నాకు బాగా నచ్చినది ఢిల్లీనే. కొన్నాళ్ళు గుర్గాఁవ్ లోనూ, మరి కొన్నాళ్ళు లక్ష్మీ నగర్ ప్రాంతం లోనూ ఉన్నా.
కాక పోతే చెన్నైలో అంత ఎక్కువ ప్రాంతాలు నాకు అక్కడ తెలియదు. చదువులో పడిపోయి ఏదో అలా అలా నడిపించాననే చెప్పాలి. ఐనా మన దేశ రాజధాని అనో, ప్రముఖులున్న ప్రాంతమనో, లేక పోతే మరెమ్దుకోగానీ నాకు బాగానే నచ్చింది.
మైసూర్, కూడా నచ్చిన ఊరే నాకు.
రెండు మూడు సార్లు మాత్రమే చూశాను కానీ ఆ వాతావరనం బాగా నచ్చింది. ముఖ్యంగా మహరాజా ప్యాలెస్, ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలూ, మైసూర్ యూనివర్సిటీ (నాలుగురోజులక్కడ ఉన్నా), శ్రీరంగ పట్నమ్ బాగున్నాయి నాకు. బస్సు దిగాక శ్రీరంగ నాధుని కోయిల్ వద్దకు వెళ్ళే మార్గంలో, టిప్పు సమాధి ఆ ప్రదేశాలు చూసి తీరాల్సిందే మరి. బెంగళూరు, మైసూరు మధ్య బస్సు మార్గంలో ప్రయాణం నాకు బాగా నచ్చిన ప్రయాణాల్లో ఒకటి.
రెండు మూడు సార్లు మాత్రమే చూశాను కానీ ఆ వాతావరనం బాగా నచ్చింది. ముఖ్యంగా మహరాజా ప్యాలెస్, ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలూ, మైసూర్ యూనివర్సిటీ (నాలుగురోజులక్కడ ఉన్నా), శ్రీరంగ పట్నమ్ బాగున్నాయి నాకు. బస్సు దిగాక శ్రీరంగ నాధుని కోయిల్ వద్దకు వెళ్ళే మార్గంలో, టిప్పు సమాధి ఆ ప్రదేశాలు చూసి తీరాల్సిందే మరి. బెంగళూరు, మైసూరు మధ్య బస్సు మార్గంలో ప్రయాణం నాకు బాగా నచ్చిన ప్రయాణాల్లో ఒకటి.
ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలో బాగోవని వేటి గురించి చెపుతాము? అన్నీ మనవే కదా ;-) మరి విదేశాల్లో?
నేను మొదట చూసిన విదేశీ నగరం జెనీవా.
అబ్బ తల్చుకుంటేనే మనసు పులకరిస్తుంది. కాస్త భాషా సమస్య ఎదురైనా అలవాటైతే అదీ తీరిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కత్తి లాంటి ఊరు. నా జెనీవిహారం గురించి B&G లో చెప్పాను కూడా...
అబ్బ తల్చుకుంటేనే మనసు పులకరిస్తుంది. కాస్త భాషా సమస్య ఎదురైనా అలవాటైతే అదీ తీరిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కత్తి లాంటి ఊరు. నా జెనీవిహారం గురించి B&G లో చెప్పాను కూడా...
జెనీవా చాలా అందమైన ఊరు. అక్కడ ఉన్న ఫౌంటైన్ ఆఫ్ యూత్ చాలా ప్రసిద్ధికెక్కింది. మొదటి సారి చదువు పని మీద వెళ్ళినా నాకు ఆ తరువాతా వెళ్ళాల్సి వచ్చింది. దాదాపూ వంద రోజుల పైనే గడిపానక్కడ. స్విస్ వెళితే నేను ముఖ్యంగా చేసే పని స్కీయింగ్. జ్యూరిచ్, బెర్న్ అలా చాలా ఉన్నా జెనీవాకి మాత్రం నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. గత నవంబరులో అక్కడ వర్క్ మీద నెల పైన ఉన్నాను. జెనీవా ద్వీపం కూడా బాగుంటుంది.
ఎవరన్నా స్విస్ వెళితే చూడాల్సిన మరో ప్రదేశం ఇంటర్లేకెన్. అందమైన ఆల్ప్స్ పర్వతాలు నచ్చని వారెవరుంటారు?
తరువాత లండన్.
లండననగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది లండన్ బ్రిడ్జ్. చిన్నప్పుడు చదువుకున్న రైమ్స్ వల్లనైనా లండనంటే తెలియని వాళ్ళు తక్కువే కదా. లండన్ బ్రిడ్జీజ్ ఫాలింగ్ డౌన్, ఐవ్ బీన్ టూ లండన్ టు లుకెట్ ద క్వీన్... :-)
కానీ నాకు లండన్ మీద ఆసక్తి కలిగించేవి రెండు అంశాలు. షెర్లాక్ హోమ్స్, వింబుల్డన్. చిన్నప్పటి నుండీ పీట్ సాంప్రాస్ ఫ్యాన్నైన నాకు సాంప్రాస్ ఎక్కువ గెల్చినందుకేమో వింబుల్డనంటే చాలా ఇష్టం.
ఎప్పటికైనా లండనెళ్ళి సాంప్రాస్ ఆడుతుండగా వింబుల్డన్ ఫైనల్ చూడాలని నా కల. సాంప్రాస్ ఆట చూడకపోయినా నాదల్ - ఫెదెరర్ 2008 ఫైనల్ మాత్రం చూసే భాగ్యం దక్కింది నా ఫ్రెండ్ వైదీ వల్ల. ఫెదెరర్ చారిత్రాత్మక పదిహేనవ టైటిల్ గెలవటం కూడా చూడ గలిగాను. మరో కోరిక బేకర్ స్ట్రీట్ చూట్టం. నిరుడు నా యూఎస్ ట్రిప్ నుంచీ తిరిగొచ్చేటప్పుడు ఒక వారం పైన లండన్ లో ఉన్నా. అప్పుడు బేకర్ స్ట్రీట్ వెళ్ళి అక్కడ ఉన్న షెర్లాక్ హోమ్స్ మ్యూజియమ్ చూశా. ఆ కథల్లో చెప్పిన ప్రదేశాలన్నీ, కాలినడకన కొన్నీ, వెహికల్స్ లో కొన్నీ అన్నీ చుట్టబెట్టేశాను.
లండన్లో థేమ్స్ నదిలో విహారం కూడా బాగుంటుంది. లండన్ బ్రిడ్జ్ అద్భుతం. బిగ్ బెన్, ట్రఫాల్గార్ స్క్వేర్, అక్కడి చారిత్రాత్మకమైన ప్రదేశాలూ, కింగ్స్ కాలేజ్, చాలానే చూశాను. ఏదేమైనా స్ట్రాబెర్రీలు తింటూ వింబుల్డన్ చూట్టమే నాకు మర్చిపోలేని అనుభూతి. నిరుడు కాసేపు విలియమ్స్ సిస్టర్స్ తో గడిపే అవకాశం వచ్చింది. చిన్న పిల్ల లాంటి మనస్తత్వం ఉన్న వీనస్ చాలా ఫ్రెండ్లీ. సెరీనా ఆటోగ్రాఫ్ ఇస్తుండగానే బుక్ లాక్కునల్లా తన సంతకం చేసి ఇచ్చింది. ఫొటోలకి ఫోజివ్వాలంటే మాత్రం సెరీనానే. :-)
ఇక నేను చూసిన మరి కొన్ని విదేశీ నగరాలు ట్రియర్, ఫ్రాంక్ ఫర్ట్, మ్యూనిక్. టెక్నికల్ యూనివర్సిటీలో ఒక రోజున్నా మ్యూనిక్ ఎక్కువ చూడలేదు. కానీ, ట్రియర్ ఫ్రాంక్ ఫర్ట్ లలో మాత్రం చెప్పుకోదగ్గన్ని రోజులే ఉన్నా. లెక్చర్ టూర్ మీద. మార్క్స్ పుట్టిన ట్రియర్లో నా ప్రో క్యాపిటలిస్టిక్ ఉపన్యాసాల వల్ల నాకు డాక్టరేట్ రావటం మాత్రం వింతైన విషయం. కొంచం ఎక్కువ రోజులే ఉన్నందున జర్మన్ బాగా వంటబట్టింది. ఎవరన్నా జర్మనీలో ఉన్న ఫ్రెండ్స్ కి మెయిల్ చేసేటప్పుడు నాలుగైదు జర్మన్ ముక్కలన్నా పెట్టందే నాకు నిద్ర పట్టదు. ఐనా ఇంకా భాష మీద పట్టు రాలేదనుకోండీ.
కానీ స్విస్ చూసిన కళ్ళకి జర్మనీ ఆనదు. పైగా జర్మన్లు కూడా లండనీయులల్లేనే రిజర్వుడు. Franz Schmidt అనే మిత్రుని సహాయంతో కొన్ని ప్రదేశాలను తిరిగాను కానీ, ఎక్కువ విధినిర్వహణలోనే గడిచిపోయింది. అందుకే జర్మనీ నగరాల గురించైతే అంత చెప్పలేను కానీ, డాక్టరేట్ తెచ్చిన ప్రాంతంగా మాత్రం ప్రత్యేకమైన అభిమానం.
ఇక చెప్పుకోవాల్సింది. న్యూ యార్క్.
అసలే నాకు ఆకాశ హర్మ్యాలంటే చిన్నప్పటి నుంచీ భలే క్రష్. దాంతో, న్యూ యార్క్ వెళ్ళగానే నేను చేసిన మొదటి పని మన్హటన్ చూడటం. నిరుడు జనవరిలో వెళ్ళి (అసలు సరైన సమయం కాదు. కానీ, వెళ్ళాల్సొచ్చింది ;-)) మేదాకా చాలా రోజులే ఉన్నానక్కడ. స్టాక్ మార్కెట్ గురించిన కొన్ని విషయాలని స్టడీ చెయ్యటానికి అని. నాకా నగరమ్తో బాగా అనుబమ్ధం ఏర్పడింది. అక్కడే మరో మంచి ఫ్రెండ్ పరిచయమయ్యింది. మారియా రోడియో గార్సియా అనే స్పానిష్ పిల్ల నేను ముద్దుగా హిస్పానిక్ జెయింట్ అని అంటుంటా. మరి అంత భారీ మనిషి. ఆరడుగుల పొడవూ, ఎనభై కేజీల బరువూనూ. మనిషి చాలా ఎట్రాక్టివ్ గా ఉంటుంది.
అసలే నాకు ఆకాశ హర్మ్యాలంటే చిన్నప్పటి నుంచీ భలే క్రష్. దాంతో, న్యూ యార్క్ వెళ్ళగానే నేను చేసిన మొదటి పని మన్హటన్ చూడటం. నిరుడు జనవరిలో వెళ్ళి (అసలు సరైన సమయం కాదు. కానీ, వెళ్ళాల్సొచ్చింది ;-)) మేదాకా చాలా రోజులే ఉన్నానక్కడ. స్టాక్ మార్కెట్ గురించిన కొన్ని విషయాలని స్టడీ చెయ్యటానికి అని. నాకా నగరమ్తో బాగా అనుబమ్ధం ఏర్పడింది. అక్కడే మరో మంచి ఫ్రెండ్ పరిచయమయ్యింది. మారియా రోడియో గార్సియా అనే స్పానిష్ పిల్ల నేను ముద్దుగా హిస్పానిక్ జెయింట్ అని అంటుంటా. మరి అంత భారీ మనిషి. ఆరడుగుల పొడవూ, ఎనభై కేజీల బరువూనూ. మనిషి చాలా ఎట్రాక్టివ్ గా ఉంటుంది.
యూఎస్ లోనే షికాగో చూశాను. వారం పైన ఉన్నా కూడా. కానీ నా షికాగో ప్రయాణం మాత్రం కేవలం సేర్స్ టవర్ చూట్టానికే పెట్టుకున్నానంటే నమ్మండి. నాకు స్కై స్క్రాపర్స్ అంటే అంత ఇష్టం మరి.
ఈసారి ఇండియన్ వెల్స్ టోర్నీ కూడా చూడగలిగే ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఒక పెద్ద హర్మ్యంలో అరవై తొమ్మిదవ అంతస్తులోంచీ ఈ టపాని రాస్తున్నా న్యూ యార్క్ లో. న్యూ యార్క్ గురించి మాత్రం ఒక ప్రత్యేకమైన టపానే రాయాలి. మొత్తానికీ నన్ను రప్పించిన ఉమా బెనర్జీ గారి పుణ్యమా అని న్యూ యార్క్ మోజు బాగా తీరింది. శ్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఫ్లషింగ్ మెడోస్, న్యూ యార్క్ బ్రిడ్జ్, దాదాపూ అన్నీ చూశాను వీకెండ్స్ లో. స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు.
న్యూ యార్క్ బ్రిడ్జ్ దగ్గర ఫొటో దిగాను. అవి నాకు బాగా ఇష్టమైనవి. ఆ ఫోటోలు చూసి ఇక్కడి ఫ్రెండ్సంతా ఎవరన్నా న్యూ యార్క్ బ్రిడ్జ్ దగ్గర ఫొటో దిగానని చూపించుకునేందుకు ఉత్సాహ పడతారు. ఇక్కడ నువ్వే ఆ బ్రిడ్జ్ ని డామినేట్ చేశావు. ఇంకేమి చెప్పుకుంటావు మీ వాళకని కామెంట్స్ చేస్తుంటే నవ్వుకోలేక చచ్చా.
ఫ్రాంక్ రూపర్ట్ శ్టాన్లీ అనే చరిత్ర ప్రొఫెసర్ ఇక్కద పరిచయమయ్యారు. ఆయనకి హెల్స్ కిచెన్ అంటే బాగా ఇష్టమట. అదే కాదు న్యూ యార్క్ చరిత్రంతా ఆయనకి కంఠోపాఠం. ఆయన దయ వల్ల న్యూ యార్క్ లో అణువణువూ తెలుసుకున్నాను.
ఇక ఇప్పటికి ముగిస్తున్నాను. మళ్ళా సుత్తి ఎక్కువైందని జనం కొడతారేమో.
కానీ ఎన్ని చూసినా చెన్నై లోని ట్రిప్లికేన్ ప్రాంతమే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు న్యూ యార్క్ కూడా. ఫస్ట్ లుక్ ఈజ్ ద బెస్ట్ లుక్ అన్నట్టు జెనీవా మరో ఇష్టమైన ఊరు.


