పెదవి పలికే మాటల్లోనే అతి తీయని మాట అని అన్నాడో కవి.
ఒక కమ్మని మాట అని అన్నాడింకో కవి.
అమ్మంటే ఊపిరి అని చెప్పాడు నా చంటి
ఎవరెన్ని చెప్పినా నాకు అమ్మ రుచి తెలియనే లేదు. మూన్నాళ్ళ ముచ్చట లాంటి బంధమొకటా భావనెలా
ఉంటుందో తెలిపినా తెలియని కారణాలు బాధించాయే కానీ, ఓదార్చలేదు నన్ను.
ఉంటుందో తెలిపినా తెలియని కారణాలు బాధించాయే కానీ, ఓదార్చలేదు నన్ను.
ఇవాళ అమ్మ పుట్టిన రోజు. అందుకేనేమో, ఎప్పుడూ లేనిది నాన్న నాకు అమ్మ ఎలా ఉంటుందో తన దగ్గరున్న
ఒకే ఒక్క ఫోటోలో చూపించారు.
ఒకే ఒక్క ఫోటోలో చూపించారు.
ఐనా తనివి తీరలేదు. నేను పుట్టినప్పుడే లోకం వదిలి వెళ్ళింది కదా



