ఫ్రెండ్షిప్ గురించి చాలా మంది చాలా కొటేషన్లు చెప్పారు కానీ, అవన్నీ నాకు అంతగా పట్టవు. అదేదో ఎసెమెస్ ఇచ్చినట్టుంటుంది... ఎవరి స్నేహం వారిదే, ఏ స్నేహపు మాధుర్యం ఆ స్నేహానిదే... అందుకే స్నేహం బదులు నా స్నేహితుల గురించిక్కడ పంచుకుంటాను
స్నేహమని అనగానే నాకు మొదట గుర్తొచ్చేది నా సెల్వి.
తన అసలు పేరు కన్నఘి సెల్వమ్, నేను సింపుల్ గా సెల్వి అంటాను. తను నాకు స్కూలు వయసు కాదు కానీ, టెన్త్ అప్పటి నుండీ పరిచయం. అదేదో సినిమాల్లో చూపించినట్టు పెద్ద బ్యాంగ్ ఏమీ లేదు. అలాగని మా మధ్య కొట్టొచ్చినట్టు కనబడే కామన్ ఇంటెరెస్ట్స్ కూడా లేవు. కానీ చిత్రంగా అలా క్రమంగా విడదీయరాని బంధమైపోయింది. ఇంటర్మీడియేట్ అయ్యాక పై చదువుల కోసం విడివిడిగా వెళ్ళాల్సి వచ్చినా మా బంధం చెక్కు చెదరలేదు. చదువయ్యాక తనని వేరే దూరంగా ఉంచటం ఇష్టం లేక నాతో కలిసి పని చేస్తావా అని అడిగితే తపకుండా అని నాతోపాటే వచ్చేసింది. పేరుకు నా పర్సనల్ సెక్రటరీ కానీ, తను నాకు బహి:ప్రాణం. తను చేసినంత ఎఫీషియంట్ గా పనిని ఎవరూ చేయలేరు. She is my EDDIE VILLERS :) తనకు ఎన్ని thanks, wishes చెప్పినా చాలదు. మాటల్లో చెప్పలేనసలు తన స్నేహాన్ని. అందుకే తను గుర్తొచ్చినప్పుడల్లా చిర్నవ్వు నవ్వుతాను. అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏమి ఇవ్వగలను?
నాకు మొదటి స్నేహితురాలు సాయి సుజన, నన్ను మొదట స్కూల్లో వేసినప్పటి నుంచీ, తను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిందాకా మా స్నేహమాగలేదు. ప్రాణం పోయినా నిన్ను వదలననే తన పుట్టిన రోజు ఇవాళ. నిజమే నన్ను వదలలేదు. ఇప్పటికీ నా ఙ్ఞాపకల్లోనే పదిలంగా ఉంది. నా ఒళ్ళోనే ప్రాణమొదిలిన తన స్నేహాన్ని నేను మిక్సెడ్ ఎమోషన్స్ తో గుర్తుంచుకోవాలి. ఎప్పుడన్నా వేరే ఊళ్ళెనప్పుడు తప్ప ఇద్దరం విడి విడిగా ఉన్నది లేదు. మా ఇద్దరి పేర్లతో అందరూ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు. అలా ఎన్ని సార్లు మేము అల్లరి చేసేవాళ్ళమో. తనతో తప్ప నాకు అల్లరనే మాటే తెలియదు. తనూ, నా అల్లరీ ఒకేసారి గాయబ్. ఎప్పుడూ అనేది... "రామ రామ మా ఇద్దరికీ ఆరొక్కటే తేడా" Sujana... Srujana "R" ఒక్కటే కదా తేడా.
ఇంటర్మీడియేట్ దాకా నాకు ఫ్రెండ్స్ ఎక్కువే అయినా తర్వాత పెద్దగా ఎవరూ మళ్ళా టచ్ లో లేరు.
గ్రాడ్ అప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు, కానీ నన్ను నన్నుగా అర్ధం చేసుకుని, నా కెరియర్ లో గట్టి పునాది వేసుకునేండుకు ప్రోత్సహించిన, నిష్పక్షపాతంగా నా తప్పులను సవరించి, సరైన మార్గంలో నడిపించిన మరో మంచి మిత్రుడు... ఆరిందామ్. చూసి ఇప్పటికి నాలుగేళ్ళు కావస్తున్నా, మెయిల్ లేదా ఫోను ద్వారా ఎప్పుడూ పలకరించుకుంటూనే ఉంటాము. నిరుడు నాకు డాక్టరేట్ వచ్చినప్పుడు దాని నిజమైన సిగ్నిఫికెన్స్ ను అర్ధం చేసుకున్న వారిలో ఆరిందామ్ ఒకరు.
నేను యూరప్ వెళ్ళే సమయాల్లో నాకు కావలసినవన్నీ సమకూర్చి, నా సెమీ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ని మిస్ కాకుండా చూట్టమే కాదు, వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిగా ఆప్యాయత చూపించే రోజర్ బారింగ్టన్, ఏనా బారింగ్టన్... వాళ్ళ పిల్లలిద్దరూ, వివియెన్, జెన్నిఫర్ (పిల్లలిద్దరూ నాకు భలే చనువు). జర్మనీలో ముఖ్యమైన ప్రదేశాల్ని చూపించిన Franz Schmidt
నిరుడు అమెరికాలో క్రాష్ కోర్స్ చేస్తూ, స్టాక్ మార్కెట్ల గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు పరిచయమయ్యి, ఎప్పటి నుంచో తెలిసినమ్మాయిలా బాగా దగ్గరైన శ్రియా మోహన్, జయాంగీ నారూవతే, చొల్లు కబుర్ల మాస్టర్, అమర ప్రేమికుడు (ఇప్పటి దాకా ముప్పై మంది అమ్మాయిలని ప్రేమించాట్ట!!! :D) జాన్ ఇంగ్లిష్, న్యూ యార్క్ నగరం అణువణువూ తెలిసిన, డీవీడీల సేకర్త, సరదా కబుర్లు చెప్పే వాకింగ్ ఎన్‍సైక్లోపిడియా ప్రొఫెసర్ ఫ్రాంక్ రూపర్ట్ శ్టాన్లీ, ఆయన చిన్న కూతురు డ్రూ హెవెన్లీ..., ఈ సంవత్సరం మంచి స్నేహితులుగా మారిన ఎక్స్ మైక్రో సాఫ్టీ మిస్టర్ ఇంగాల్స్ (చాలా పెద్దాయన. కానీ, నన్ను మిస్టర్ ఇంగాల్స్ అని పిలుస్తేనే తృప్తి అంటారాయన. ఇంగాల్స్ అనేది ఒక Ayn Rand హీరో మరి
ఇక బ్లాగుల్లో పరిచయమైన వాళ్ళతో స్నేహ బంధమని చెప్పలేము కానీ, నేనంటే ఆప్యాయత ఉన్న వాళ్ళు చాలా మందే. వాళ్ళ అందరికీ ఆ విషయం తెలుసనే అనుకుంటున్నాను. ఇక నా తోటి వాళ్లతోనైనా రెగ్యులర్ టచ్ లో ఉండేది సుజ్జితోనే. ప్రియ కూడా ఫ్రెండే కానీ, తను నాకన్నా, మా చంటోడికే ఎక్కువ ఫ్రెండ్.
పెద్ద వాళ్ళలో డాక్టర్ కమాలా కాయ, పీఎసెమ్ లక్ష్మి గారు, ఙ్ఞాన ప్రసూన గారు... ఇవన్నీ స్నేహాలనలేనేమో కానీ, మాల గారైతే రెండు రోజులు ఆన్లైన్లో కనిపించకపోతే వెంటనే మెయిల్ పెట్టేస్తారు. ఆవిడ చెప్పే గ్రానీ తరహా కబుర్లు భలే రిలాక్స్ చేస్తాయి. ఎప్పుడైనా హైద్ వస్తే మీ ఇంటికే మొదట వస్తానని మాత కూడా ఇచ్చేశాను.
చాలా చిత్రంగా జ్యోతి గారు నా గురించి రాసిన ఒక టపా ద్వారా పరిచయమైన సునీత గారు మరో తమాషా ఫ్రెండ్. ఇద్దరమూ Ayn Rand అభిమానులం, అంటే మాది Rand కలిపిన బంధమన్నమాట! :) ఈ మధ్య వాళ్ళ గుంటూరు కోడలిని కావటం వల్ల బంధం మరింత పెరిగిందేమో...
పెద్దగా వేరే బ్లాగులెక్కువ చదవటం, కామెంట్ పెట్టటం చెయ్యను కనుక మిగిలిన వారితో ప్రత్యేకమైన అనుబంధం తక్కువే. అయినా ప్రమదావనం మిత్రులున్నారు కదా. అక్కడే పలకరింపులన్నీ... :) మమత గారి స్నేహం మరో తమాషా అనుభవం. ఆర్కుట్ ద్వారా పరిచయమైన ప్రమద ఆవిడ.
అన్నట్టు చెప్పటం మరిచానండోయ్! నిరుడు న్యూ యార్క్ లో మకాం పెట్టినప్పుడు నా పక్క కాటేజ్ లోనే ఉండే హిస్పానిక్ చిన్నది (చిన్నదేమి నా మొహం ఆరడుగుల ఆజాను బాహురాలు) మారియా రోడియో గార్సియా. రాఫెల్ నాడల్ అభిమాని, నా చంటి వింబుల్డన్ విలేజ్ ని వింబుల్డను వారి కంట పడేలా చేసి, తనకి వింబుల్డన్ అఫీషియల్ బ్లాగుకి కంట్రిబ్యూట్ చేసేలా అవకాశం రావటానికి కారణమైన తననెలా మర్చిపోగలను?
ఇదన్నమాట నా ఫ్రెండ్స్ లిస్టు.
బాబోయ్ ఇంత లిస్టే అంటారా? కానీ, నాకు కూడా కుళ్ళు పుట్టించే స్నేహం ఇంకోటి ఉందంటే నమ్ముతారా? ధనరాజ్ మన్మధ, తనూ ఎంత స్నేహితులంటే అది నేను చెప్పలేను. కొన్ని సార్లు వాళ్ళ స్నేహాన్ని గురించి మాట్లాడే అర్హత ఎవరికన్నా ఉందా అని అనుకునేంత స్నేహమిద్దరిదీ. ఇలాంటి స్నేహముందంటే నమ్మలేము కూడా...
అలాగే నలభై ఏళ్ళ తరబడి సాగుతూ, ప్రాణంలో ప్రాణంగా మెసిలే నాన్నా, ప్రొఫెసర్ మథ్యూస్ అంకుళ్ళ స్నేహమన్నా అప్పుడప్పుడూ కాస్త కుళ్ళుగానే ఉంటుంది.
Apart from all these I have a new friend via Facebook these days, a nice woman, whom I wo'nt name, but she knows it...
అయ్యబాబోయ్! ఎంత పెద్ద పొరబాటు చేశాను! ఇంతటి అంతెత్తు మనిషిని మర్చి పోవటమే... కృష్ణ కృష్ణా!
మ జాజిపూలు నేస్తమండీ...!!! ఆయ్
Happy friendship day to you all...


