img.emoticon { padding: 0; margin: 0; border: 0; } సృజనగీతం: 24 mm: మొదటి భాగం img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Oct 4, 2010

24 mm: మొదటి భాగం

ఇందాకన chronology of Frederick Nietzsche చూస్తూ శ్రీశ్రీశ్రీ పతి దేవులవారు కనిపిస్తే, మనం కూడా అలా ఒకసారి రాసుకుంటే బాగుంటుంది కదా అనిపించ మొదలెట్టిన ప్రయత్నం ఇది. సంవత్సరాల వారీ నా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు...



1986:

జనవరి ఒకటిన బ్రాహ్మీ ముహుర్తంలో, అంటే 3:33 కి పుట్టాను. మన సంప్రదాయం ప్రకారమైతే డిసెంబరు 31 న పుట్టినట్టు. అంటే తెల్లవారితే జనవరి ఒకటి. 

ఆ సంవత్సరంలో మొదటి ఆరు నెలలూ, నాన్న స్నేహితులైన ప్రొఫెసర్ ఇగోర్ మా౨త్థ్యూస్ గారి భార్య జాక్వెలైన్ మా ఇంట్లోనే ఉన్నారు. నాన్నకి పసి పిల్లలని పెంచటంలో మెళకువలని నేర్పటానికి. నాన్న ఆ సంవత్సరం కాలేజ్ మానేసి, పొద్దునా, సాయంత్రాలు ట్యూషన్లు పెట్టుకుని నన్ను చూసుకున్నారు. జాక్వెలైన్ ఆంటీకప్పుడు అరవైయ్యేళ్ళు. ఇప్పటికీ నేను పెంచిన పిల్ల అని మురిసిపోతుంటారు.

1987: నాకు బాగా ఙ్ఞాపకముంది... నాన్న నా పుట్టిన రోజున తీసిన ఫొటో. వనాఫ్ ద బెస్ట్ ఫొటోస్ ఐ హా౨వ్ ఎవర్ సీన్. పెద్ద విశేషాలేవీ లేవు కానీ, నాన్న నన్నో చేత్తో ఎత్తుకుని, వంట పన్లు అవీ చక్కబెట్టుకోవటం, పద్యాలూ, రైమ్స్, నేర్పటం, కథలూ అవీ చెప్పటం లీలగా గుర్తు. నాన్నకు కుదరనప్పుడు అన్నయ్య నీళ్ళు పోసి, బట్టలు తొడిగి ఆడించేవాడు. 

1988:

జూన్లో బళ్ళో పడక తప్పలేదు. ఐ హా౨వ్ నో రిగ్రెట్స్. పిల్లలము పెరుగుతుండటంతో నాన్న మళ్ళా కాలేజ్ కి వెళ్ళక తప్పని స్థితి. వంటరి తల్లులకి పిల్లల్ని పెంచటం ఎంత కష్టమో, నాన్నలకు కూడా అంతే కదా. మీ అమ్మాయి చక చకా నేర్చుకుంటుందండీ అంటే మురిసిపోయేవాడు. అన్నయ్యతో వెళ్ళే అవకాశం ఉన్నా, నాన్న ఇద్దరినీ దింపే వెళ్ళేవారు. సాయంత్రం మాత్రం అన్నయ్యతో కలిసి. ఇంకాస్త పెద్దయ్యేదాకా భుజానికి తన బా౨గూ, ఒక చేత్తో బుట్టా పట్టుకుని నన్నెత్తుకుని, మధ్య మధ్యలో అలుపు తీర్చుకునేందుకు కిందకి దించుతూ... అప్పుడు అర్ధమయ్యేది కాదు కానీ, నాకోసమన్నయ్య ఎంత కష్టపడ్డాడో అనిపిస్తుంది.

అమ్మ, నాన్న లో రెండు సగాలు కదా అన్న.

1989:

మొదటి సారి నా ఎడమ చేతి వాటం మీద చర్చ. నాన్న నన్ను బలవంత పెట్టలేదు. మొదటి సారి వైజాగొదిలి మరో ఊరికి ప్రయాణం. హైదరాబాదు వెళ్ళాను. మా౨త్థ్యూస్ అంకుల్ వాళ్ళ ఇంటికి. ఎక్కాలూ, తెలుగు ఇంగ్లీషు రాయటం బాగా వచ్చింది. నా మొదటి ఫ్రెండు సాయి సుజన పరిచయం. ఇంటర్మీడియేట్లో తను చనిపోయిందాకా మా ఇద్దరి స్నేహం కొనసాగింది. ఒకళ్ళనొకళ్ళం ఒదిలి ఉండే వాళ్ళం కాదు. చదువులోనూ మంచి పోటీ. ఒకే స్కూలూ, ఒకే కాలేజ్. 

రోజూ మా ఇంటికొచ్చి నాతో ఆడుకునేది. తనని తీసుకెళ్ళేందుకు వచ్చేవారు వాళ్ళ నాన్న గారు. అలా మొదలైన పరిచయం క్రమంగా స్నేహానికి దారితీసి, నాన్నా, ఆయనా ఇప్పటికీ రోజూ కలుస్తూనే ఉంటారు. అంటే పిల్లలు కుదిర్చిన స్నేహమన్నమాట వాళ్ళది.

1990

కొత్తగా ఏమీ లేదు మామూలే. చిన్న చిన్న పన్లు చెయ్యటం నేర్చుకుని నాన్నకి సహాయంగా ఉండేదాన్ని. కొత్త పరిచయాలూ, ఇంకొంత మంది స్నేహితులూ. ఈ సంవత్సరం పరిచయమైన స్నేహితుల్లో, నిషా అగర్వాల్ బాగా క్లోజ్. సిక్స్త్ లో ఉండగా, వాళ్ళు డెల్లీ వెళ్ళిపోయారు. చిత్రంగా, నా గ్రాడ్యుయేషన్లో తను కనిపించింది మళ్ళా. అలా పీజీ దాకా కల్సి చదూకున్నాము. నాకన్నా ఒక సంవత్సరం పెద్ద. ఇక్కడ ఒక సంవత్సరం జూనియర్.

1991

సమ్మర్ హాలిడేస్ లో నాన్న మమ్మల్ని సౌతిండియా టూర్ తీసుకుని వెళ్ళారు. మద్రాస్ నగరంతో పరిచయమప్పుడే. ఎందుకోగానీ బాగా నచ్చింది. పెద్దయ్యాక అక్కడే ఉండాలని అనుకున్నాను. అది నిజం చేసుకున్నాను కూడా. 

1992

హాయ్ హాయ్. నాకూ నాయనమ్మ ఉందోచ్! తను చెప్పినమ్మాయిని చేసుకోనందుకు నాన్న మీద అలిగి రావటం మానేసిన నాయనమ్మకి ఎవరో చెప్పారట. మీ చందూ కూఉరు చాలా అందంగా ఉంది. ముచ్చటైన పిల్ల అని. ఆవకాయ పెట్టుకునే టైముకి వచ్చింది. అంతే అలా ఉండిపోయింది. (మాతోనే ఉండి పోయిందని కాదు. రాకపోకలు మొదలయ్యాయన్నమాట) అంటే మాకు పెద్ద దిక్కు దొరికిందన్నమాట!

కొన్ని విషయాల్లో నాతీరు ఆవిడకి నచ్చేది కాదు. ఉదాహరణకి... గోడలూ చెట్లూ, అవీ ఎక్కటం. అస్సలు దీనికి  ఆడపిల్లల లక్షణాలు లేవురా చందూ అనేది ఎప్పుడూ. నాన్న నవ్వేసేవాడు. 

వంట నేర్చుకున్న ఫేజ్ కూడా అదే. అంత చిన్నతనంలోనే నేర్చుకుంటం వల్లనేమో బాగా అలవాటైపోయింది. పైగా నాన్న ఎప్పుడూ ఏపనైనా హుషారుగా చేసేవాడు. మాకూ అదే అలవాటు వచ్చింది.

చదువులో మెరిట్ గా ఉంటంతో నన్ను ఒక సంవత్సరం ముందుకి నెట్టారు. తను రిటైరయ్యేలోగా నాకు చదువవ్వాలని నాన్న చేసిన ప్రయత్నమది. సుజన కోసం నేను పట్టుబట్టటంతో తనని కూడా నా క్లాసులోనే వేశారు. 

ఈ క్లాసులోనే నా ఎడ్డీ విల్లర్స్... సెల్వి పరిచయం. సాయి, నేను, సెల్వీ ఒక జట్టు. మాకు త్రీ మస్కటియర్స్ అని పేరొచ్చింది. 

1993

నాయనమ్మ పూర్తిగా మాతోనే ఉంటం మొదలెట్టింది. స్విమ్మింగు, టెన్నిస్ నేర్చుకుంటం ప్రారంభమైంది సమ్మర్ హాలిడేస్లో.

క్రమంగా బాబాయ్ వాళ్ళూ, మిగిలిన బంధువులూ రావటం మొదలైంది.

అప్పుడు తెలియలేదు కానీ, నరసరావు పేట వెళ్ళాను నాన్నతో. ఒక రోజున్నాము. నాకా ప్రయాణం ఎందుకు ఇష్టమంటే... అక్కడ గడియార స్థంభం ముందు నాన్న తీసిన ఫొటో అద్భుతమనే చెప్పాలి. వీధిలైట్ల వెలుగులో, లైటింగులని ఎడ్జస్ట్ చేసుకుంటూ ఆయన తీసిన విధానం ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకేమాత్రం తీసిపోదు. 

అలాగే... అప్పుడు శర్మ అంకుల్ నాకు కొన్న కుందేలు బొమ్మ ఒప్పటికీ నా దగ్గరే ఉంటుంది. ఒక మధురమైన ఙ్ఞాపకం. దీని గురించి పేట్రియాట్స్ బ్లాగులో రాశాను కూడా. 

Fact is stranger than fiction అంటారు కదా... అలాంటి సంఘటనే ఒకటి జరిగిందప్పుడు. నరసరావు పేట పార్కులో నాన్న మాట్లాడి, గొప్ప పండితులని పరిచయం చేసిన తాతగారు, ఇప్పుడు మా మామ గారు, చంటీ వాళ్ళ నాన్న గారు. 

1994:

మళ్ళా క్లాసు ముందుకు జరిగింది. నా అదృష్టం... మా స్నేహం అప్పటికే లెజండరీ స్టేటస్ పొందిందప్పటికే. దాంతో, అలాగే బాగా చదువుతుంది కనుకా సుజన నాతోనే ముందుకొచ్చింది. సెల్వి మాత్రం దూరమైంది. ఐనా మా స్నేహం మాత్రం అలానే కొనసాగింది.

ఆగస్టు పదిహేనప్పుడు నేను మాట్లాడిన తీరుకి మెచ్చుకుని మా స్కూలుకి అతిథిగా వచ్చినాయన నాతో పాటూ మా ఇంటికొచ్చి నాన్న ముందు అభినందించారు. అదో తమాషా ఙ్ఞాపకం.

అన్నయ్య టెంత్ అయిపోవటంతో నాకు ఫ్రెండ్స్ తో ఇంటికి వచ్చేయటం అలవాటైంది. 

డిసెంబరులో అనుకుంటా ఇంట్లో నాయనమ్మ వంట చేస్తున్నప్పుడు కట్ల పామొచ్చింది. దాన్ని చూసి ఆవిడ కంగారు పడుతుంటే నేను గభాలున పట్టేసుకుని పెద్ద డబ్బా లాంటిది ఉంటే దాంట్లో పడేసి మూత పెట్టేశాను. నాయనమ్మ మొదటిసారి నన్ను మెచ్చుకుంది. ఎంత ధైర్యమే నీకు అని. అదే నాన్న పెంపకంలో గొప్పతనం. నాన్న ఇంటికొచ్చాక  డబ్బా పారేశాము.

చదువు మీద ఆసక్తి ఎక్కువ కావటంతో ఆటల మీద ఎక్కువ కూచోలేదు కానీ, టెన్నిస్ బాగా ఆడతాను. చూట్టం కూడా అలవాటైందా యేడు. అంటే అప్పటిదాకా ఇంట్లో టీవీ ఉండేది కాదు. పీట్ సాంప్రాస్ ఆట వింబుల్డన్లో చూసి ఫ్లాట్. ఎలాగైనా సెంటర్ కోర్ట్లో కూచుని ఆట చూడాలని నిర్ణయించుకున్నాను. దిస్ డ్రీమ్ ఆల్సో ఫుల్ ఫిల్డ్. నా ఫ్రెండ్ వైదీ సహాయంతో రెండు సార్లు చూశాను. ఫెడరర్ నా డల్ ఎపిక్ ఫైనల్ నా మొదటి సారి.

1995:

సెవంత్ క్లాస్ కి వచ్చాను. వయసు తక్కువ కావటం వల్ల డేటాఫ్ బర్త్ మార్పించారు నాన్న. బాగా మార్కులు రావటంతో అన్నయ్య, తను సేవ్ చేసుకున్న పాకెట్ మనీ తో విల్సన్ టెన్నిస్ రాకెట్ తెచ్చి గిఫ్ట్ గా ఇచ్చాడు. 

సెల్వీ వాళ్ళు చెన్నై వెళ్ళిపోయి, మళ్ళా రెండేళ్ళకి రావటంతో మా త్రీ మస్కటియర్స్ విడిపోవాల్సి వచ్చింది. మొదటి సారి ఒక మనిషి కోసం ఏడవటం అంటే అప్పుడే అనుభవంలోకి వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయ్టప్పుడు, పెద్దయి చదూకున్నాక ఒక్కచోటే ఉద్యోగం చెయ్యాలని అనుకున్నాము. మా మాటలు విని పెద్ద వాళ్ళు నవ్వుకున్నా మేము ఇప్పటికీ కలిసే ఉద్యోగం చేస్తున్నాము. షీజ్ మై పర్సలల్ సెక్రటరీ...

1996

పెద్ద మనిషి నయ్యాను. ఎందుకు ముఖ్యమంటే అదే మా ఇంట్లో నాకు ఊహ తెలిశాక జరిగిన పెద్ద వేడుక. ఇంటి నిండా జనాలు. భలే సందడి కొత్త అనుభవం.

సెవెంత్ పరీక్షలయ్యాక నాన్న ద ఫౌంటెయిన్‍హెడ్ బహుమతిగా ఇచ్చారు. టెంత్ అయ్యాక చదువు. ఈలోగా మంచి పుస్తకమది. దాచి పెట్టుకో అన్నారు. భద్రంగా అట్ట వేసి నాకోసమని దాచారు. షెర్లాక్ హోమ్స్ పరిచయం. రామాయణ భారతాలూ, నాన్న, నాయనమ్మా చెప్పిన కథలు కాకుండా మొదట చదివిన ఇతర కథలవి. కొన్నాళ్ళు నేను హోమ్స్ ఐతే, సుజన వాట్సన్. 

1997:

అన్నయ్య ఉపనయనం. మొదటిసారి రాకపోయినా రెండో ప్రయత్నంలో ఐదొందలలోపు రాం౨కు తెచ్చుకుని అన్నయ్య ఇంజినియరింగ్ లో చేరాడు. నాకన్నా మంచి రాం౨కు తెచ్చుకుంటే నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని అన్నయ్య అన్నాడు. వెంటనే కాదు కానీ, నిరుడిచ్చాడా గిఫ్ట్.

సెల్వీ వాళ్ళు మళ్ళా వచ్చారు కానీ, మా స్కూలు కాదీసారి. ఐనా మా స్నేహం మాత్రం చెక్కు చెదరలేదు.

1998: పిల్లల పాలిట గండం టెంత్ లో అడుగు పెట్టాను.

1999: టెంత్ లో బాగా మార్కులు రావటంతో నాన్న నాకు కైనెటిక్ హోండా కొన్నారు. ఇంటరంతా అదే వాడుకున్నాను. సమ్మర్ హాలిడేస్ లో ద ఫౌంటెయిన్‍హెడ్ తీసిచ్చారు నాన్న. అలా Ayn Rand పరిచయమైంది. అట్లాస్ ష్రగ్డ్... జాన్ గాల్ట్... పెద్ద పెద్ద కలలు కంటం మొదలైంది.

ఇంటర్మీడియేట్ ఎంపీసీ. నా గోల్ కూడా ఇంజనియర్ కావాలనే. అన్నయ్య బాగా చదూతుంటంతో, నా ఇంటరెస్ట్ కూడా అదే కావటంతో, చందూ పిల్లలిద్దరూ ఇంజనియర్లైనట్టే అని నాయనమ్మ అనేసుకుంది.

మొదటిసాఇ ఈవ్ టీజింగ్ అనుభవంలోకొచ్చింది. కానీ నాకు ధైర్యమెక్కువ కావటం వల్లా, అన్నయ్య సహాయం వల్లా నాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఎదురు కాలేదు కానీ, సున్నిత మనస్కురాలైన సుజన మాత్రం కాస్త ఇబ్బంది పడింది. 

ఐలవ్యూ చెప్పలేదని ఒకడు నా పుస్తకాలన్నీతీసుకెళ్ళి సైడ్ కెనాల్లో పారేశాడు ఎగ్జామ్సప్పుడు. అన్నయ్య వాడి మక్కెలిరగదన్నాడు. పుస్తకాలు పారేస్తే నేను చదవలేననుకున్నావా అని వాడితో అన్నాను. అలేగే ఎవరి పుస్తకాలూ తీసుకోకుండా పరిక్షలు రాశాను. సంవత్సరం మొత్తం చదివిన చదువు చివరిలో బాగా ఉపయోగపడ్డది. నేనూ, సుజనా క్లాస్ ఫస్ట్ కాదు కానీ, మంచి స్కోర్సే తెచ్చుకున్నాము. నేను బెటర్మెంట్ కట్టలేదు.

2000: నా జీవితంలో పెద్ద కుదుపు. ఈవ్ టీజింగ్ సమస్య వల్ల ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరంలో ఉండగా సుజన ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ అమ్మమ్మా, తాతయ్యల విలేజ్ కి వెళ్ళి పురుగుల మందు తాగేసింది. నేనూ నాన్నా హాస్పిటల్ కి వెళ్ళాము. ఐ వాంటూ లివ్ సృజీ అంటూ నా చెయ్యి పట్టుకుని ప్రాణాలొదిలేసింది నా బంగారు స్నేహితురాలు.  కన్నీళ్ళాగలేదు. నాన్నని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. కొన్నాళ్ళు చాలా బాధ పడ్డాను. ఎందుకో ఉన్నట్టుండి విపరీతమైన కసి వచ్చేది. ఎవరి మీదో తెలియదు. ఐనా చదువు మీద మాత్రం కాంసంట్రేషన్ తగ్గలేదు.

సెల్వి మా కాలేజ్ లోనే చేరటం కూడా నాకు హెల్ప్ అయింది.

2001: అన్నయ్య ఇంజినియరింగైపోయి ఉద్యోగం రావటం, నా ఇంటర్మీడియేట్ మంచి మార్కులు, ప్లస్ ఎంసెట్లో నలబై రెండో రాం౨కు రావటం ఒకేసారి జరిగాయి.

కానీ ఇక్కడే మా జీవితాల్ని మార్చేసే సంఘటన జరిగింది. అన్నయ్యా, నాన్నా, నాయనమ్మా, అప్పుడప్పుడూ వచ్చే బాబాయిలూ, స్నేహితులతో హుషారుగా గడిచిపోయే జీవితం మరో మలుపు తిరిగింది...