2001:
ఇప్పటి దాకా నా జీవితంలోని వ్యక్తులు, నా వాళ్ళు నాన్నా, అన్నయ్యానూ. స్నేహితులు అంటే సుజన, సెల్వి, ఇంకా కొంత మంది. అప్పుడప్పుడూ వచ్చే నాయనమ్మతో నా అనుబంధం. అప్పుడప్పుడు లానే ఉండేది. మరో ఎనిమిదేళ్ళ దాకా ఆవిడకి నా మీద పూర్తి స్థాయి మమతానుబంధాలు ఏర్పడలేదు.
ఒక పదిహేనేళ్ళ అమ్మాయి జీవితంలో అప్పటికి నేను ఉన్నత స్థితిలో ఉన్నట్టే. కలలూ, ఆశలూ, ఊహలతో నా భావి జీవితం మీద కొన్ని ఆలోచనలతో ఉన్నాను.
ఇంతకు ముందు ముగిసింది ఇంటర్వెల్ అనుకుంటే ఇప్పటి దాకా హీరో రానేలేదు కదూ! :) నా కలల రాకుమారుడు...
కానీ వచ్చిన వ్యక్తి మాత్రం ఆం౨టీ హీరో... (Anti hero)
ఇంజినియరింగ్ చదువుతానని అందరూ అనుకున్నారు. నాన్న కూడా! అన్నయ్యైతే దానికి కావలసిన ఏర్పాట్లు కూడా మొదలెట్టేశాడు. కోరిన చోట సీటొస్తుంది.
*** *** ***
మా ఇల్లు రెండంసస్థులుండేది. పైన మూడు గులుంటాయి. అందులో ఒక దాన్లో అన్నయ్య ఉంటే మరోటి నాన్న పర్సనల్ స్టోర్ రూమ్. మరో దాన్లో నేను చదూకునేదాన్ని. కింద ఉన్న మూడు గదుల్లో ఒకటి వంట ఇల్లు కాగా, రెండోది పూజ గది, మిగిలింది లివింగ్ రూమ్. అన్నయ్కి జాబ్ వచ్చి వెళ్ళటంతో ఒక రూమ్ ఖాళీగా ఉంటుంది.
జూన్ 21:
సెల్వి, లలిత, నవ్యా, జానకీ (నా ఫ్రెండ్స్) లతో నేను కూచుని మాట్లాడుతున్న సమయంలో నాన్న నేనున్న గదికి ఫోను చేశారు, "మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు. అతనికిక్కడ ఏదో పనున్నది. రెండు రోజులుంటాడు. అన్నయ్య గదిలో ఏర్పాటు చెయ్యి."
ఇంతలో గది తలుపు మోగటంతో నేను లేచి వెళ్ళి తలుపు తీశాను. మిగతా అందరూ మంచం మీద కూర్చుని ఉన్నారు. తలుపు తీస్తూనే, "ఎస్ వాట్ డూ యూ వాంట్?" అన్నాను.
ఎదురుగా బక్క పల్చగా, చెదిరిపోయిన జుట్టు, కళ్ళజోడుతో ఉన్న ఎర్రటి కుర్రాడు నన్ను ఆపాద మస్తకం చూస్తున్నాడు. ఆ చూపులో ఒకరకమైన ఓనర్షిప్ కనిపించింది నాకు. నేనడిగిన ప్రశ్నకి తను చెప్పిన సమాధానం విని నా ఫ్రెండ్సంతా షాక్ అయ్యారు.
క్షణ కాలం నాకు ఆశ్చర్యమనిపించినా, నా గొంతులో కానీ, మొహంలో కానీ అది కనపడకుండా, "ఫస్ట్ గో ఎన్ టేకే బాత్. యూ లుక్ లైకే ట్రాం౨ప్." అన్నాను.
*** *** ***
ఇంకో నెల రోజులకి... బీబీఎమ్ ప్లస్ బీఏ ఎకనమిక్స్ లో చేరాను. డెల్లీలో. మూడు నెలలు తిరగకుండానే ఆరిందామ్, సెలెక్ట్ చేసిన స్పెషల్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ లో నేను కూడా ఒక దాన్ని. మొత్తం ఆరుగురం. ఇద్దరమ్మాయిలం, నలుగురబ్బాయిలు. అక్కడ పరిచయమయ్యాడు సునీల్ భాస్కరన్. మా టీమ్ ఆనర్ కింద జరిగిన బాల్ లో సునీల్ నాకు ప్రొపోజ్ చేశాడు. నేను నవ్వేసి ఊరకున్నాను.
*** *** ***
2002:
సమ్మర్ హాలిడేస్ లో ఇంటికెళ్ళినప్పుడు నిరుడు నన్నాశ్చర్య పరిచిన ఎర్రటి కుర్రాడు మళ్ళా కనిపించాడు. మా మధ్య జరిగిన సంభాషణలో తనన్న మాటలు నాకు బాగా నచ్చాయి.
"వెయ్యి సార్లు తప్పు చేసినంత మాత్రాన వెయ్యిన్నొకటో సారి కూడా తప్పు చెయ్యాలనేమీ లేదు. లైఫీజ్ నాట్ మా౨థమేటిక్స్. జనరలైజ్ చెయ్యటానికి. సో మనీ థింగ్స్ కెన్ హా౨పెన్. లైఫ్ హా౨జ్ సో మెనీ పాజిబిలిటీస్." ఈసారి కూడా రెండు రోజులున్నాడు నా ఆం౨టీ హీరో. తను వచ్చిన పని నేనే అని నాకు తను నాతో మాట్లాడిన మొదటి మాటల్లోనే చాలా స్పష్టంగా చెప్పేశాడు.
"వెదర్ యూ లైక్ మీ ఆర్ నాట్ ఈజ్ నాటే క్వశ్చన్ ఫర్ మీ. ఐ డోంట్ గివే డా౨మ్ అబౌటిట్. I feel it an honor for me that I am able to recognize you, and able to love you. What you feel about me does not concern me. And I don't ask you. I have just expressed what I felt about you. I can not take it a thing of pride if you like me. నువ్వు నన్ను గుర్తిస్తే, ప్రేమిస్తే, అది నాకు గొప్పగా భావించటం అర్ధం లేని విషయం. నిన్ను నేను ప్రేమించ గలగటమన్నది నాకు గౌరవం. That I am able to recognize you for what you are... ," మాటల్లో సరైన కొహెరెన్స్ లేదు. వాక్యాన్నక్కడే పూర్తి చెయ్యకుండానే వదిలేశాడు. కానీ నాకు తెలియకుండానే తను చెప్పాలనుకున్నది పూర్తిగా రీచ్ ఐనట్టనిపించింది. ఇంతకు ముందెప్పుడూ అలాంటి భావనెక్కడా నాకు కలగలేదు. ఇదే సంభాషణ కొన్నేళ్ళ తరువాత మళ్ళా కొనసాగింది. నాన్నతో తను మాట్లాడేప్పుడు.
"I did not say anything to you now. But I know that what I wanted to convey you has reached you." అన్నాడు
ఇతను నా మనిషి అని అప్పుడే ఒక నిర్ణయానికొచ్చాను.
*** *** ***
డెల్లీ వెళ్ళాక మళ్ళా ప్రొపోజ్ చేశాడు సునీల్. "నా మనిషిని నేను రీచయ్యాననిపిస్తోంది." నవ్వేశాను. తను కూడా గ్రేస్ ఫుల్ గా తల పంకించాడు. మాకు స్పెషల్ ట్రైనింగ్ మొదలైంది. వచ్చే సంవత్సరం యూరప్ ట్రిప్ కి వెళ్ళాలి."
నా పాత స్నేహితురాలు నిషా అగర్వాల్ నాకు జూనియర్ గా వచ్చి చేరింది. పన్నెండేళ్ళ తరువాత మళ్ళా కలిశాము.
2003:
ఇంకో నెల రోజుల్లో యూరప్ ట్రిప్ కి వెళతామన్నప్పుడు తను డెల్లీ వచ్చాడు. తన స్నేహితునితో బైక్ మీద. అతన్ని వదిలి, నన్ను చూట్టానికి తన ఫ్రెండ్ అగర్తల తో కల్సి వచ్చానని అన్నాడు. ఆ బైకర్ ఫ్రెండ్ ఇంకో మూడేళ్ళకి ధనరాజ్ మన్మధ అనే పేరుతో నాకు పరిచయమయ్యాడు. ఇప్పుడు మాత్రం ఒక అన్నోన్ పర్సన్.
"నిన్ను చూడకపోతే అగర్తలనే నేను పెళ్ళి చేసుకునే వాడిని." అప్పటి డైలాగ్. కాసేపుండి వెళ్ళిపోయాడు.
*** *** ***
యూరోపియన్ ట్రిప్ బాగా సక్సెస్ఫుల్ గా నడిచింది నాకు. మరో ప్రాణ స్నేహితురాలు వైదీ (ఫార్మర్ టాప్ ట్ఎన్ టెన్నిస్ ప్లేయర్, ఇప్పుడు రిటైరైంది, నికోలె వైదిసోవా) పరియం. అక్కడే నాకు నా కెరియర్ ని ఎలా మల్చుకోవాలో ఒక అవగాహన కలిగింది. నా ఆలోచనలని ఆరిందామ్ ప్రోత్సహించాడు.
2004:
గ్రాడ్ లో రెండు స్ట్రీమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఎంబీఎమ్ తో పాటూ ఎమ్మే ఎకనమిక్స్ తీసుకున్నాను. మైక్రో, అండ్ మాడర్న్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ ఉమా బెనర్జీ పరిచయం.
*** *** ***
తను ఎమ్మెస్సీ ఫిజిక్స్ లో చేరానని ఫోన్ లో చెప్పాడు. అంతే తప్ప మా కలయిక మాత్రం జరగలేదు. కానీ నాకు తెలియకుండా నా ఆలోచనప్పుడప్పుడూ తన మీదకు మళ్ళటం నేను గమనిస్తూనే ఉన్నాను. హి ఈజ్ రీచింగ్ మై సోల్...
కొన్ని చిత్రమైన సంఘటనలు, ఒక భీతావహమైన అనుభవం తప్ప మామూలుగా గడిచిపోయింది. సునీల్ మధ్యలోనే చదువు వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న గారు చనిపోవటంతో! వెళ్ళే ముందు నన్ను కలసి, "నీ మనిషిని నేను చూడ వచ్చా?" అనడిగాడు. ఫొటో ఉంటే, నీకు అభ్యంతరం లేకుంటే చూపించ మన్నాడు.
ఫొటో లేదన్నాను. అసలు మేమిద్దరం కలిసిందే మూడు సందర్భాల్లో. కలిసినప్పుడు మాట్లాడుకోవటమే తప్ప, విడిగా మా మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఉన్నా తన కెరియర్ ప్లాన్స్, నా కెరియర్ ప్లాన్స్ గురించో, అంతే!
ఫొటో లేని ప్రేమా? నవ్వుతూ అన్నాడు సునీల్.
అవునా? నాది ప్రేమేనా? నేనాలోచనలో పడ్డాను. దసరాకి వైజాగొచ్చినప్పుడు నాన్న అన్నారు. తన మద నీ అభిప్రాయమేంటి అని. నేను నవ్వేసి ఊరుకున్నాను. నాన్న మళ్ళా అడగలేదు.
*** *** ***
2005:
పుట్టినరోజుకని వైజాగొచ్చాను. అప్పుడు ఒక అనుకోని సంఘటన జరిగింది. దాని ఇంపా౨క్ట్ నాకు ఈ సంవత్సరం కనిపించింది.
ఎలా ఉందో నా పిచ్చి ప్రయోగం. నచ్చితే మరొక్క సారి రావాల్సి వస్తుందిక్కడికి. :) నచ్చకపోయినా ముగింపు నేను రాయాలి కదా...!
(మా ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణలూ, తన ప్రవర్తనా, ఆలోచనా విధానం, జీవితం పట్ల దృక్కోణం, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పటం కుదరని పని ఇక్కడే. అందుకే కాస్త కన్ఫ్యూజన్ కలుగ వచ్చు చదివిన వారికి. అవన్నీ చివరి భాగం చదివితే తీరిపోతాయి)
(మా ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణలూ, తన ప్రవర్తనా, ఆలోచనా విధానం, జీవితం పట్ల దృక్కోణం, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పటం కుదరని పని ఇక్కడే. అందుకే కాస్త కన్ఫ్యూజన్ కలుగ వచ్చు చదివిన వారికి. అవన్నీ చివరి భాగం చదివితే తీరిపోతాయి)


