రామ రాజు తాతయ్య మీలవ్వు సంగతి సరే అబ్బాయీ, "ల" అంత్య ప్రాసగా ఏదన్నా చిన్న కవిత చెప్పు చూద్దామని, భోజనాల దగ్గర అడిగినప్పుడు చంటి చెప్పిన మాటలు ఇవీ...
నువ్వు నాకు ఉయ్యాల...
నేను నీకు జంపాల
మన ఇద్దరి మురిపాల
కాస్త ఆలోచించుకుని,
చెయ్యి కడుక్కునేందుకు లేస్తూ వెనక్కి తిరిగి చూస్తూ...
పాపలిద్దరు కలగాల
"ఇలా చెప్పానని నన్ను సాఫ్టనుకోకండి. చెప్పటానికి బానే ఉంది గానీ తాత గారూ... ఈ సున్నితత్వముంది చూశారూ, నా వంటి కంతగా పడదు. హోకే, కానియ్యండి కానియ్యండి. అప్పుడప్పుడూ ఉండాల్సిందే. ఇట్సాల్రైట్" అనేసి వెళ్ళిపోయాడు.
తాతయ్య నా వైపు కాసేపు అదోలా చూసి, "మీ వాడున్నాడూ చూసావూ చందూ (నాన్న)..." అంటూ పెద్దగా నవ్వేశారు. అందరూ ఆయనతో శృతి కలిపారు.
*** *** ***
గోదావరి ఒడ్డున పండుగ బహు పసందుగా ఉంది.
అందరికీ ఈ చిన్నికవితతో దీపావళి శుభాకాంక్షలు


