img.emoticon { padding: 0; margin: 0; border: 0; } సృజనగీతం: ధనుర్మాసం: పాంచరాత్రాంతర్గత శ్రీలక్ష్మ్యష్టోత్తర శతనామ స్తోత్రం img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Dec 17, 2010

ధనుర్మాసం: పాంచరాత్రాంతర్గత శ్రీలక్ష్మ్యష్టోత్తర శతనామ స్తోత్రం

ఎంతగానో ఎదురు చూసిన ధనుర్మాసం నిన్న మొదలైంది. మధ్యాహ్నం మూడు గంటలకు. 

ఈ సందర్భంగా పాంచరాత్రాంతర్గతమైన, శ్రీరంగంలో వాడతారు అని చెప్పబడే శ్రీలాక్ష్మ్యష్టోత్తర శత నామ స్తోత్రాన్ని అందించాలని ఆశ. సాధారణంగా అందరికీ తెలిసిన స్తోత్రంలా కాకుండా ఇది చదువుకునేందుకు, వినేందుకు కూడా చాలా బాగుంటుంది. అలాగే అంగ న్యాస, కర న్యాసాలవీ లేవు కనుక పారాయణమ్ చెయ్యాలనుకునే వారికి కూడా ఇది సులభంగా ఉంటుంది. కేవలం భక్తి చాలు... అన్న రీతిన ఉండే ఈ స్తోత్రాన్ని చూడండి...

శ్రీమతే రామానుజాయ నమః



శ్రీ: లక్ష్మీ కమలాదేవీ మా పద్మా కమలాలయా|
పద్మేస్థితా పద్మవర్ణా పద్మినీ మణిపఙ్కజా||

పద్మప్రియా నిత్యపుష్టా: ఉదారా పద్మమాలినీ|
హిరణ్యవర్ణా హరిణీ: అర్ఘ్యా చన్ద్రా హిరణ్మయీ||

ఆదిత్యవర్ణా౭శ్వపూర్వా హస్తినాద ప్రబోధినీ|
రథమధ్యా దేవజుష్టా సువర్ణరజతస్రజా ||

గన్ధద్వారా దురాధర్షా తర్పయన్తీ కరీషిణీ|
పింగళా సర్వభూతానాం ఈశ్వరీ హేమమాలినీ||

కాంసోత్స్మితా పుష్కరిణీ జ్వలన్తీ అనపగామినీ|
సూర్యా సుపర్ణా మాతాచ విష్ణుపత్నీ హరిప్రియా||

ఆర్ద్రాయ:కరణీ గంగా వైష్ణవి హరివల్లభా|
శ్రయణీయా హైరణ్యప్రాకారా నళినాలయా||

విశ్వప్రియా మహాదేవీ మహాలక్ష్మీ వరారమా|
పద్మాలయా పద్మహస్తా పుష్టీ: గన్ధర్వసేవితా||

ఆయాసహారిణీ దివ్యా శ్రీదేవీ చన్ద్రసోదరీ|
వరారోహా భృగుసుతా లోకమాతా౭మృతోద్భవా||

సిన్ధుజా శార్ఙ్గిణీ సీతా ముకున్దమహిషీన్దిరా|
విరించిజననీ ధాత్రీ శాశ్వతా దేవపూజితా||

దుగ్ధా వైరోచనీ గౌరీ మాధవి అచ్యుతవల్లభా|
నారాయణీ రజ్యలక్ష్మీ: మొహిని సురసున్దరీ||

సురేశ సేవ్యా సావిత్రీ సంపూర్ణాయుష్కరీ సతీ|
సర్వదు: హరా౭రోగ్య కారిణీ సత్కళత్రికా||

సంపత్కరీ జయత్రీ సత్సన్తాన ప్రదేష్టదా|
విష్ణు వక్షస్థలావాసా వారాహీ వారణార్చితా||

ధర్మఙ్ఞా సత్య సంకల్పా సచ్చితానన్ద విగ్రహా|
ధర్మదా ధనదా సర్వకామదా మోక్షదాయినీ||

సర్వశతృక్షయకరీ| సర్వాభీష్ట ఫలప్రదా||

||ఓమ్ శ్రీమహాలక్ష్మ్యై నమ:|| 

ఈ ధనుర్మాసంలో పాశురాలతో పాటూ ఈ స్తోత్రాన్ని కూడా చేస్తే మంచిదని అంటారు