మా తుఝే స(గు)లామ్!
కొత్తా దేవుడండీ, కొంగొత్తా దేవుడండీ... పాతలో లాగా జనానికీ, అల్లాగే (అయ్యో బూతర్థం తీయకండి. పడరాని వారి కంట బడితే నాకు బడితె పూజ కాదు, ప్రాణాలే టపా కట్టేయొచ్చు. భూమ్మీదింకొంత కాలముండి మరి కొంత మంది చేత తిట్టించుకోవాల్సిన/శాపనార్థాలు పెట్టించుకోవాల్సిన పని ఉంది, నాకోసం కాకపోయినా, కనీసం వారికోసమన్నా తిన్నగా పోదాము) అజ్జనమునందలి వాడినే కనుక నాకునూ (ఎవరినీ, దేనినీ కాదు) క్రొత్త అనంటే ఇష్టమే. కానీ నాకు నచ్చనిది మాత్రం క్రొత్త సంవత్సరమనే కాన్సెప్టు.
నవమ్బరు, డిసెమ్బరు నెలలంటే నాకు భలే ఇష్టం. చల్లటి వాతావరణం, రొమాన్టిగ్గా ఉండే వాతావరణం, వరుసగా వచ్చే పండుగలూ, సెలవలూ, హాఫియర్లీ పరీక్షలూ, గ్రీటింగుల సందడీ అవీనూ. కానీ ఎందుకో గానీ నాకు ఈ క్రొత్త సంవత్సరనమన్నదే నాకు నచ్చదు. నచ్చదు అంటే ఆ ఒక్కరోజే ఏదో గొప్పదన్నట్టు, మిగతావన్నీ కానట్టు బిల్డప్పులే కాకుండా, హా౨పీ న్యూ యియర్ అనుకుంటూ అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలెత్తే జనం, మిగిలిన రోజుల్లో ఈసురోమంటూ ఉంటం వల్ల అన్నమాట.
అలాగే మన ఉగాది లాగా, దీనికో ప్రత్యేకతంటూ లేదు. ఏదో మాకు దొరికింది కనుక ఈరోజు పెట్టుకున్నాం. మీ ఇష్టం అన్నట్టనిపిస్తుంది. పైగా వ్యాపార మాయాజాలమొహఠీ!
నాకైతే క్రొత్త సంవత్సరమంటే... అమ్మ కడుపులోంచీ మనమొచ్చిన రోజే అనిపిస్తుంది. అంటే మన పుట్టిన రోజన్నమాట!
ఆకలేసినప్పుడు అన్నం పెట్టినా, తప్పు చేసినప్పుడు వెనకేసుకొచ్చినా, ఆకాశాన్నికి ఎత్తినా, అధ:పాతాళానికి త్రొక్కినా, ప్రేమగా లాలించినా, కోపంతో దండించినా, కొట్టినా, తిట్టినా, పొగిడినా, తెగడినా, వరమిచ్చినా, శపించినా, ఏమి చేసినా నిన్ను నిన్నుగా చూడగలిగేదీ, నువ్వనే వాడున్నావని అనుక్షణమూ గుర్తుంచుకునేదీ, నీకోసం తపించి పోయేదీ, సృష్టి మొత్తమ్మీద ఒక్కరే!

కోపమొచ్చినా, నవ్వొచ్చినా, ఏడుపొచ్చినా, మన ఊపిరి తీసుకునే వేగం పెరుగుతుంది. ఎందుకు? ఏరకమైన ఉద్వేగం కలిగినా మన ఊపిరి వేగం పెరుగుతుంది ఎందుకు? ఏవిధంగా చూసిన ఈ లోకంలో మనిషన్నవాడికి వేరొకరితో సంబంధమున్నదంటే అమ్మతోనే. మిగిలిన అన్ని బంధాలూ ట్రా౨ష్. అవసరం కొద్దీ పెట్టుకునేవే అన్నీ. అమ్మ వల్ల నాన్నా, అమ్మ కడుపులోంచీ మనలాగే వచ్చారు కనుక తోబుట్టువులు, అమ్మ సోదరులు కనుక మేనమామలూ, తన అమ్మా నాన్నలు కనుక అమ్మలూ తాతయ్యలూ, అవీ ఇవీ అని అన్ని బంధాలొచ్చాయి కానీ, అమ్మ మాత్రం ఎవరి ఆధారం లేకుండా మనిషికొచ్చే ఒకే ఒక బంధం. తన శరీరంలోని ఒక భాగమే కదా మనం. తన ప్రేగుని కోసి మరీ మనని బయటకు తెస్తుంది.
అందుకేనేమో మననీ తనలాగే, ఇంకా చెప్పాలంటే తనకన్నా ఎక్కువగానే ప్రేమిస్తుంది. అలాంటి అమ్మ ,మ్మ అయిన రోజునకన్నా సంతోషకరమైన రోజెప్పుడు ఉంటుంది?
ప్రపంచంలోనే అద్భుతమైన విషయం ఒక మనిషి పుట్టటం. అణువంతగా ప్రారంభమైన మనిషి అణుబాంబుని కనిపెట్టేంత ఎదిగినా, ఒక అమ్మకు బిడ్డడే కానీ, వేరొక రకంగా భావింవచలేమే. సృష్టికి ప్రతిసృష్టి అని ఎంత జబ్బలు చరచుకున్నా, అమ్మ కడుపులోంచీ వచ్చిన బిడ్డకున్నంత సుఖము వేరొకరికి ఉండునా? ప్రపంచంలోని అన్ని వస్తువులూ కాలుష్యభరితమైనా అమ్మ ఇచ్చే పాలు పాలన్నా కాలుష్యం కావు కదా.
ఈ ప్రపంచంలో నన్ను నన్నుగా నమ్మే ఏకైక వ్యక్తి మా అమ్మ. ఏ మాటలు చెప్పినా ఒక రెండేళ్ళ క్రితం వరకూ నన్ను నమ్మేది. అప్పటి దాకా ఏదోక కోర్సో, చదువో ఉండేవి కనుక, ఏనాటికైనా వీడి పేరు పేపర్లో పడుతుందనే ఆశతో ఉండే పిచ్చి తల్లి, అప్పటితో నా చదువుడు చాలించానన్న నిజం తెల్సి, ఇక వీడి పేరు పేపర్లో పడదు కనుక వీడిన నమ్మటం వృధా అని డిసైడైపోయింది. ప్చ్!
మా అమ్మ చాలా అమాయకురాలు. ఏమాయ చేయటం కూడా తెలియదు పాపం. తననాశ్రయించిన వారందరూ తన బిడ్డలలాంటి వారే, వాళ్ళు కూడా ఒక అమ్మ కడుపున పుట్టిన వారే అన్న భావన.
నాకైతే అమ్మని జగదాంబత్తగారిలా వంటి నిండా నగలేసుకుని, నల్ల కళ్ళజోడు పెట్టుకుని కుర్చీలో కాలు మీద కాలేసుకుని జనాన్ని హడలు గొడుతూ, కంటి చూపుతో కంట్రోలు చెయ్యాలని. మనకు కంట్రోళ్ళూ, రోకళ్ళూ నాకెందుకురా అబ్బీ, ఇంట్లో ఉన్నవి చాలవూ అంటుంది నేను ఆ మాటన్నప్పుడల్లా. హయ్యో పిచ్చితల్లీ, ఆమాత్రం ఉండందే జనం నిన్ను లెక్క చెయ్యరమ్మా, అంటే... జనం నన్ను లెక్క చేస్తే ఎంత చెయ్యక పోతే ఎంత? మీరు బాగుంటే నాకు అదే పది వేలు అంటుంది. సరే అయితే, నీకు నా శాలరీ సేవింగ్సు (వాటినే షేవింగ్సంటాను) లో పదివేలిద్దామనుకున్నాను. నేను బావుంటే చాలన్నావు కదా, నేను బావుంటానులే అని జోకితే నవ్వేస్తుంది. కానీ అమ్మా, నేను అనకొండ గాడిలా అంత గ్లామరస్ గా ఉండను కదా, అప్పుడు పది వేల విలువ ఎలా చేస్తాను అంటానా? ఎవరికో నాకు తెలియదు. నువ్వు మాత్రం నాకు పది వేలు కాదు, లక్షల కోట్ల విలువైన వాడివంటుంది.
చూశారా? కేవలం ప్రేగు బంధం వల్ల వచ్చే ఈ ప్రేమ! ఇంత ప్రేమను మన మీద ఇంకెవరు కురిపించగలరు? మరి అలాంటి అమ్మ అమ్మయిన రోజుకన్నా మనకి గొప్పది ఇంకేముంటుంది?
నాకు దాదాపూ పద్దెనిమిదేళ్ళొచ్చే దాకా అమ్మతో అనుబంధం తక్కువే. ఆవిడ వంటింటికే పరిమితం, నాకు ఆటపాటలూ అన్నీ నాన్నతోనే. అమ్మకు అసలు తీరుబడి ఉండదు. మూణ్ణరేళ్ళ వయసులో పాలు త్రాగటం మానేశాక ఎక్కువ తనతో సమయం గడిపే అవకాశమే ఉండేది కాదు. రాత్రి పూట కథలు చెప్పినప్పుడూ, ముట్టైన రోజుల్లో తాక కూడదంటారు కనుకా, అమ్మ దగ్గరకు వెళ్ళాలనే తప్ప అసలు అమ్మకు ఒక హృదయముంటుంది, తను కూడా నాలాంటిదే అన్న ఆలోచన కూడా ఉండేది కాదు. ఆవిడకూ ఆలోచనలుంటాయంటే నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా తను వంట ఇంట్లోనే, పొయ్యి దగ్గరే. హారతి కర్పూరంలా తన ఆరోగ్యం కరిగిపోయాక, ఉమ్మడి కుటుంబం వదిలేసి వచ్చాక, వదిన కాస్త బాధ్యతలందుకున్నాకా అమ్మకి విశ్రాంతి అంటే తెలిసింది కానీ, లేకపోతే...?
అప్పుడు అమ్మని చదవటమ్మొదలెట్టాను. తన ఆలోచనలని గమనించటమ్మొదలెట్టాను. నాకెందుకో చిత్రంగా అమ్మకు దగ్గరయ్యాకే నా ప్రపంచం పరిథి పెరిగినట్టనిపించింది. ఆలొచనలలో క్లారిటీ ఎక్కువైనట్టనిపించింది. అనిపించటం కాదు. నిజం! ఎందుకంటే ఒక మనిషి అత్యంత స్వేచ్ఛగా ఉండగలిగేది అమ్మ దగ్గరే. Progress comes from freedom అన్న మాట కనుక నిజమైతే నా నిజమైన ప్రోగ్రెస్ అమ్మతో నా స్నేహమ్మొదలయ్యాకే మొదలైంది. మనిషికి అభివృద్ధి ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే మరి. మరి నా అభివృద్ధికి తొలి మెట్టు అయిన అమ్మని తెలుసుకున్న రోజుగాక నాకు వేరొక రోజు ఇష్టమెలా అవుతుంది? కనుక అమ్మతో సంబంధమున్న రోజులన్నీ నాకు న్యూ యియర్సే.
చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. ఒకసారి అమ్మతో మాట్లాడుతూ అమ్మా, నన్ను కడుపుతో ఉన్నప్పుడు న్కు అనారోగ్యం ఏసిందట కదా, పరమ పాపిస్టి వెధవలను కనేప్పుడే అలాంటివి జరుగుతాయి కదా అన్నాను. (ఎందుకో అమ్మ దగ్గర నా తిక్క వాగుడంతా ఇలానే ఉంటుంది. ఆవిడ అంతరంగాన్ని చదవాలంటే నాకు ఇంతకు మించిన మార్గం తోచదు). ఏమీ కాదు, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, అందుకే నువ్వు నా కడుపులో పడ్డాక ఒక్కసారి పెరిగి (సైన ప్రాబ్లమనుకుంటాను, ఇంకా చాలా అనారోగ్య సమస్యలున్నాయప్పుడు) ఒక్కసారి పెరిగి నువ్వు పుట్టాక నీకు భయపడి పారిపోయాయి. ఆ తరువాత పదేళ్ళు తలనొప్పి కూడా ఎరుగను. నువ్వు చేసే అల్లరి ఎక్కువైనప్పుడు తప్ప, అని అటు తన ప్రేమనూ, నా తరహా కొంటె తనాన్నీ మేళవించి చెప్పిన సమాధానం విన్నప్పుడనుకున్నాను. అమ్మ అంటే అంతే కదా అని. ఎన్ని జరిగినా తన బిడ్డలే గొప్ప!
అమ్మ ఒళ్ళో గచ్చు నేల మీద వెల్లికికలా పడుకుని, చేతిలో ఏపుస్తకమో పెట్టుకుని చదువుకుంటుంటే, తను నోట్లో అన్నం పెడుతున్నపుడు చవి చూసే అమ్మ రుచి, ఆవిడ మాట్లాడే అమ్మ భాష, వీటిని మించిన సౌఖ్యముండునే?
ఎంత లగ్జూరియస్ బెడ్డైనా, ఎన్ని పిజ్జా, బర్గర్లైనా అమ్మ ఒడికీ, అమ్మ చేతి ముద్దకూ సాటి వస్తాయా?
అమ్మ తరువాత నన్ను అంతలా చూసుకుంటున్నది, చూసినదీ, చూడబోయేది... ఇంకెవరు? :-)

నిన్ను తనలోంచీ బయటకు తీసుకు వచ్చి, ఈలోకానికి నిన్ను పరిచయం చేసేది అమ్మయితే, నిన్ను తనలో కలుపుకుని నీకంటూ క్రొత్త లోకాన్నిచ్చేది భార్య.
ఈసారి క్రొత్త సంవత్సరాన్ని (Whatever hell it is) పైన చెప్పినట్టు అమ్మ దగ్గర జరుపుకోవాలనుకున్నా ఒకానొక కారణం వల్ల నేను సోనియా గాంధీ కావాల్సి వచ్చింది. అమ్మ ఇప్పుడు నాకు దగ్గరలో లేదు. ఆచ్చి వెళ్ళింది. దగ్గర ఉన్నా, దూరంగా ఉన్నా, నా ఆలోచనలో ఉండకుండా ఉండదుగా!
అన్నట్టూ, ధనుర్మాసానికి రెండు రోజుల ముందు అమ్మ పుట్టింది. అది కూడా నాకు క్రొత్త సంవత్సరమే మరి.
పీఎస్: రాసింది తనే!
అమ్మ గురించి తను రాసిన ఇంకొక గొప్ప టపా ఇక్కడ
అమ్మ అయిన ప్రతి స్త్రీకీ ఒక గొప్ప ట్రిబ్యూట్ అది. చెప్పిన విధానంలోని ఇన్టెన్సిటీ చూడండి
గమనిక: తన న్యూ యియర్ రిసాల్యూషన్ (నచ్చినా నచ్చకపోయినా కా౨లెండర్ మొదలైయ్యేది కదా అంటాడు) అమ్మ కోరికైన పేపర్లో ఫొటో పడాలని. మామూలుగా సాధ్యం కాకున్నా, కనీసం ఏ మాఫియా డాన్ గా మరాన్నా పేపర్లోకెక్కాలని ఎన్ని ప్లా౨న్లేస్తున్నాడో పాఆఆఆ...పం.
అనుబంధాల గురించి కనుక నా బ్లాగులోనే పెట్టమన్నాడు. టపాలో సీరియస్నెస్ లేదనుకునే వాళ్ళకి ఒక మాట... తను వాళ్ళ అమ్మ దగ్గరున్నప్పుడు, వారి అనుబంధాన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడూ ఇక్కడ ఉన్న లైటర్ టోన్ వెనక ఉన్న సీరియస్నెస్, ఆ అనుబంధం గొప్పదనమూ అర్ధమవుతుంది. తన మాటల్లోని ప్రేమను చూడండి. ఈమధ్యనే నాకు కూడా ఆవిడ ప్రేమను చవి చూసే భాగ్యం దక్కింది :-)
ఎన్ని ఫొటోలు పెట్టినా అమ్మని రిప్రెజెంట్ చేసేంత గొప్పగా ఉండవు కనుక వద్దన్నాడు.
కొస మెరుపు: తను రాసేప్పుడు ఎక్కువగా వాడే పదం... 'మాట' అదే ఎందుకో ఎక్కువ తప్పుగా పడుతుంటుంది. మాట బదులు 'మాత' అని. సబ్ కాన్షస్ గా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తుంటాడు కనుక అలా జరుగుతుందేమో అనిపిస్తుంది. పైకి మాత్రం ఏ expression మనకు తెలియనివ్వడు